స్వగ్రామానికి మావో దంపతుల మృతదేహాలు | maoist dead body reached warangal | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి మావో దంపతుల మృతదేహాలు

Published Thu, Jan 28 2016 9:22 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

maoist dead body reached warangal

వరంగల్: ఒడిశాలో మూడు రోజుల క్రితం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నేత సుశీల్‌కుమార్, ఆయన భార్య సోని మృతదేహాలు వరంగల్‌కు చేరుకున్నాయి. సుశీల్‌కుమార్ స్వగ్రామం నర్సంపేట మండలం భాంజిపేటలో గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగనున్నాయి.
 
పోలీసులు ప్రత్యేక అంబులెన్సులో మృతదేహాలను భాంజీపేటకు తీసుకువచ్చారు. కాగా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓజీ) గత ఆదివారం జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. సుశీల్ కళింగ్ నగర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఆయనకు వ్యతిరేకంగా పలు ఠాణాల్లో  50కి పైబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement