విద్యాసాగర్‌రెడ్డి, శ్రుతి ఎన్‌కౌంటర్ ప్రదేశంలోనే..
ములుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కలకలం సృష్టించిన విద్యాసాగర్‌రెడ్డి, శ్రుతిల ఎన్‌కౌంటర్ జరిగిన వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్ సమీపంలోని దరవాజగుట్ట ఒర్రెలో(వాగులో) శుక్రవారం మావోయిస్టుల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా క్రైం అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
దరవాజగుట్ట ఒర్రెలో(వాగులో) మావోయిస్టుల డంపు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ములుగు డీఎస్పీ రాజమహేం ద్రనాయక్, ములుగు, ఏటూరునాగారం సీఐలు శ్రీనివాస్‌రావు, కిషోర్‌కుమార్, పస్రా ఎస్సై యాసిన్ సీఆర్పీఎఫ్ బలగాలతో అక్కడికి వెళ్లి వెతికారు. డంప్‌ను ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించి చూడగా అందులో రెండు 303రైఫిల్స్ గన్‌లు, 61 రౌండ్స్‌కు సరిపడా మార్క్-3 బుల్లెట్లు, టు ప్లస్ టు 104 రౌండ్‌ల బుల్లెట్లు, రెండు మ్యాగ్జీన్‌లు, నోకియా సెల్ బ్యాటరీ, టెస్టర్, 4 బెల్ట్‌లు, లైటర్, ఆయస్కాంతం దిక్సూచి ఉన్నాయి.
మావోయిస్టుల డంపు లభ్యం
Published Sat, Nov 28 2015 2:57 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement