తెలంగాణ అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి..అమెరికాలో పెళ్లి | marriage of telangana girl and andhra boy in america | Sakshi
Sakshi News home page

తెలంగాణ అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి..అమెరికాలో పెళ్లి

Published Tue, Nov 11 2014 1:51 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

marriage of telangana girl and andhra boy in america

వికారాబాద్:  వికారాబాద్ ఎమ్మెల్యే బి. సంజీవరావు కుమార్తె వివాహం అమెరికాలోని చికాగోలో చర్చ్ ఆఫ్ క్రాస్‌లో అంగరంగ వైభ వంగా జరిగినట్లు ఎమ్మెల్యే అనుచరులు పేర్కొన్నారు. వివరాలు.. ఎమ్మెల్యే సంజీవరావు ద్వితీయ పుత్రిక సుష్మా ప్రియాంకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వాసి తవ్వ సుబ్రహ్మణ్యం కుమారుడు తవ్వ వినయ్‌కుమార్‌కు ఇచ్చి ఈ నెల 9న చికాగోలో బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిపించినట్లు వారు తెలిపారు.

వధూవరులిద్దరూ అమెరికా పౌరత్వాన్ని కలిగి ఉన్నారు. వరుడి కుటుంబం చికాగోలో స్థిరపడింది. ఆంధ్రా అబ్బాయితో తెలంగాణ ఎమ్మెల్యే కుమార్తె వివాహం జరగడం సర్వత్రా చర్చనీయాంశైంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement