B. Sanjeeva rao
-
వికారాబాద్ జిల్లా కేంద్రం కాకుంటే..ఆమరణ నిరాహార దీక్ష
♦ సీఎం కేసీఆర్ మాటపై పూర్తి నమ్మకం ఉంది ♦ వీడీడీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరావు ♦ జిల్లా కేంద్రంపై కాంగ్రెస్ పూర్తి సహకారం : మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ వికారాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా పశ్చిమ రంగారెడ్డిలోని వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయమని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బి.సంజీవరావు అన్నారు. అలా కానీ పక్షంలో ఉద్యమంలో ముందు నడిచి ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు - అభివృద్ధి అనే అంశంపై మంగళవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ సమావేశ మందిరం లో వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫోరం(వీడీడీఎఫ్) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటపై నిలబడే వ్యక్తి అని, ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేస్తారన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని కోరారు. వికారాబాద్ జిల్లా నాలు గు నుంచి ఐదు నియోజకవర్గాలతో ఏర్పడడం ఖాయమన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరుపున జిల్లా కేంద్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యేందుకు పూర్తిసహకారం అందిస్తామని చెప్పారు. వికారాబాద్ జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమన్నారు. జిల్లా విషయంలో తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.. వికారాబాద్ ప్రజలకు ముందు నుంచి పాల కులు అన్యాయం చేస్తూనే ఉన్నారని, గతంలో పార్లమెంట్ స్థానాన్ని చేవెళ్లకు, ప్రభుత్వ ఆసుపత్రిని తాండూరుకు తరలించి తీరని అన్యాయం చేశారని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం అవుతుందంటే లేనిపోని ఆందోళనల తో ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నాయకులు ఐక్యంగా ఉండి వికారాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. లేని పక్షంలో ప్రమాదం పొంచి ఉందన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటులో తేడా వస్తే ప్రత్యేక రాష్ర్ట తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, వీడీడీఎఫ్ నాయకులు శుభప్రద్‌పటేల్, కె.శ్రీనివాస్, నర్సింహు లు, మారుతి, టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు రత్నారెడ్డి, రాజు నాయక్, వేణుగోపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి శివరాజ్, నాయకులు పెం డ్యాల అనంతయ్య, సురేష్, రవిశంకర్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.విఠల్, పీఆర్టీయూ నర్సింహులు, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
తెలంగాణ అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి..అమెరికాలో పెళ్లి
వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే బి. సంజీవరావు కుమార్తె వివాహం అమెరికాలోని చికాగోలో చర్చ్ ఆఫ్ క్రాస్‌లో అంగరంగ వైభ వంగా జరిగినట్లు ఎమ్మెల్యే అనుచరులు పేర్కొన్నారు. వివరాలు.. ఎమ్మెల్యే సంజీవరావు ద్వితీయ పుత్రిక సుష్మా ప్రియాంకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వాసి తవ్వ సుబ్రహ్మణ్యం కుమారుడు తవ్వ వినయ్‌కుమార్‌కు ఇచ్చి ఈ నెల 9న చికాగోలో బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిపించినట్లు వారు తెలిపారు. వధూవరులిద్దరూ అమెరికా పౌరత్వాన్ని కలిగి ఉన్నారు. వరుడి కుటుంబం చికాగోలో స్థిరపడింది. ఆంధ్రా అబ్బాయితో తెలంగాణ ఎమ్మెల్యే కుమార్తె వివాహం జరగడం సర్వత్రా చర్చనీయాంశైంగా మారింది. -
నిబంధనలు పాటించరా?
శాటిలైట్ టౌన్ పనుల సమీక్షలో ఎమ్యెల్యే సంజీవరావు మండిపాటు వికారాబాద్: చట్టాలు కాంట్రాక్టర్లకు,అధికారులకు వర్తించవా అని వికారాబాద్ శాసనసభ సభ్యులు బి. సంజీవరావు ప్రశ్నించారు. తప్పు చేసిన వారెంతటివారైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శాటిలైట్‌టౌన్ పనులకు సంబంధించిన సమీక్ష సమావేశంలో ఆయన సంబంధిత అధికారులతో పాటు ఆ పనులు చేస్తున్న నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ సిబ్బందితో మాట్లాడారు. పట్టణంలో జరుగుతున్న శాటిలైట్‌టౌన్ పనుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఎవరి హాయంలో ఈ పనులు జరిగాయే వారినే బాధ్యులను చేసి చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులనుద్దేశించి అన్నారు. పట్టణంలో ఈ పనులతో రోడ్లన్ని పూర్తి స్థాయిలో పాడైపోయి దుమ్ముదూళీ ఎక్కువైందని, దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని చెబుతూ ఈ నేపథ్యంలో ప్రత్యమ్నాయ చర్యలు తీసుకోవలసి బాధ్యత మీపై ఉన్నదనే విషయాన్ని మీరెందుకు విస్మరించారని ఆయన అధికారులను నిలదీశారు. శాటిలైట్‌టౌన్ కింద చేపట్టిన అండర్‌డ్రైనేజీ,అండర్ వాటర్ సప్లయి పైపులై న్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. శాటిలైట్‌టౌన్ గైడ్‌లైన్స్‌లో పొందు పరచిన నిబంధనల ప్రకారమే పనులు జరగకపోతే తిరిగి ఆ పనులను చే యించడానికి తాను వెనకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పట్టణంలో యూజీడీ పైప్‌లైన్ ఏర్పాటుకు రూ.64 కోట్లను,అండర్‌గ్రౌండ్ వాటర్ పైప్‌లైన్‌కు రూ.76 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది... మరి మీరు ఇప్పటి వరకు ఎన్ని నిధులను ఖర్చు చేసి ఎంత వరకు పనులను పూర్తి చేశారని నిలదీశారు. ఈ నేపథ్యంలో పబ్లిక్‌హెల్త్ డిపార్టుమెంట్ ఎస్ఈ సమాధానమిస్తూ యుజీడీకి సంబంధించి రూ.31 కోట్ల వరకు, అండర్‌గ్రౌండ్ నుంచి మంచినీటి సరఫరా పైపు లైన్ ఏర్పాటుకు రూ.51 కోట్ల పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. డ్రైనేజీ పైప్‌లైన్ 96 కిలోమీటర్ల మేర, మంచినీటి పైప్‌లైన్120 కిలోమిటర్ల మేర పనులు పూర్తి అయినట్లు తెలిపారు. రెండు సంవత్సరాల కాల వ్యవధి తమకు ప్రభుత్వం కేటాయించిందని, ఇప్పటికి సంవత్సరం పూర్తి కాగా ఇంకా సమయం ఉందన్నారు. పట్టణంలో తవ్వేసిన రోడ్లకు సంబంధించి ప్యాచ్ వర్కులను త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. పార్కుల్లో వాటర్ట్యాంకులా! భారత ప్రధాన న్యాయస్థానం ప్రజలకు సంబంధించిన పార్కు స్థలాల్లో ఎలాం టి నిర్మాణాలను చేపట్టొద్దని స్పష్ట మెన ఆదేశాలను జారీ చేసింది. మరి ఈ విషయం అధికారులకు తెలియదా లేక తెలిసి కూడా ఎన్సీసీకి అనుకూలంగా వ్యవహరించాలని మున్సిపల్ అధికారులు భావించారా అని ఎమ్మెల్యే నిలదీశారు. శాటిలైట్‌టౌన్ సంబంధించిన వాటర్ ట్యాంకులను పట్టణంలోని పార్కుల్లో ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ఈ విషయమై ఎవరైన కాలనీ వాసులు సుప్రీంకోర్టుకు వెళ్లితే పనులు ఆగిపోయే అవకాశం ఉంది కదాని నిలదీశారు. పట్టణంలో నాలుగు చోట్ల పార్కు స్థలాల్లో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు.ఒక్కొక్క ట్యాంక్ నిర్మాణం కోసం సుమారుగా 400 నుంచి1000 గజాల స్థలం తీసుకున్నారు వీటి విలువ సుమారుగా రూ.4 కోట్ల వరకు ఉంటుందన్నారు.వాటర్ ట్యాంకుల ఏర్పాటుతో పట్టణ ప్రజలకు పార్కులు అందుబాటులో లేకుండా పోయాయని అధికారులపై మండిపడ్డారు. పనిచేయని అధికారులు దయ చేసి ఇక్కడినుంచి బదిలిపై వెళ్లిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ జైత్రామ్నాయక్,పబ్లిక్ హెల్త్ ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి , డీఈ గోపాల్,ఏఈ హన్మంత్రావునాయక్,ఎన్సీసీ సిబ్బంది అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల పనితీరు మారాలి
వికారాబాద్: అధికారుల పనితీరు మారలని, లేదంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్‌కు మంజీరా నీళ్లు రానేలేదు.. రూ.39 లక్షల బిల్లు ఎలా వచ్చిందని మండి పడ్డారు. కాంగ్రెస్ హయాంలో మూడేళ్ల క్రితం రూ.33 కోట్లతో పైప్‌లైన్ పూర్తి చేసి చేతులు దులుపుకున్నారని, చుక్కనీరు రప్పించలేకపోయారన్నారు. ట్రయల్న్‌క్రోసం నీటిని విడుదల చేసినంత మాత్రన రూ.39 లక్షలు బిల్లు ఎలా వస్తుందని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి పైప్‌లైన్‌కే నీరు దిక్కులేదు.. రెండో పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నట్లు అని ప్రశ్నించారు. మంజీరా నీటి విషయమై సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్‌లోని జలమండలి అధికారులతో మాట్లాడి చెప్పాలని ఆదేశించారు. పట్టణంలో మురుగు కాల్వలు సక్రమంగా లేవని, శాటిలైట్‌టౌన్ పేరిట ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ తవ్వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జరుగుతున్న పనుల్లో నాణ్యత కొరవడిందని, డంపింగ్‌యార్డు నిర్మాణ పనుల్లో రూ.33 లక్షల నిధులు గోల్మాల్ అయినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వీటిపై విచారణ జరిపిస్తానన్నారు. తాను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు బీటీఎస్ కాలనీలో ఉన్న ఇంద్రారెడ్డి పార్కు స్థలం ప్రభుత్వానిదని, ఈరోజు అది ప్రైవేటు వ్యక్తులది ఎలా అయిందని మున్సిపల్ అధికారులను నిలదీశారు. ఈ స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ జైత్రాంనాయక్ను ఆదేశించారు. ఇప్పటికైనా అధికారులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, డీఈ గోపాల్, ఏఈ హన్మంత్‌రావు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మాధవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘మాజీల పోరు’లో గెలిచేదెవరో..
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన వికారాబాద్‌లో ఈసారి ఇద్దరు మాజీ మంత్రుల మధ్య రసవత్తర పోటీ జరుగనుంది. 2008 ఉప ఎన్నికల్లో వూజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ (టీఆర్ఎస్)పై కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఆయనే విజయం సాధించి.. కిరణ్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి ఇచ్చారు. మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. మాజీ జెడ్పీటీసీ బి. సంజీవరావు అనూహ్యంగా టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్రాంతికుమార్ పోటీలో ఉన్నారు. తెలంగాణ అంశం కీలకంగా వూరిన ఈ ఎన్నికలు ప్రసాద్‌కుమార్‌కు సవాలుగా మారాయి. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం: ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 8, టీడీపీ -4, టీఆర్ఎస్-1, ఇండిపెండెంట్-1 ప్రస్తుత ఎమ్మెల్యే: ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్) రిజర్వేషన్: ఎస్సీ నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం అధికం. ఎస్సీ ఓటర్లే ఎక్కువ. గెలుపు, ఓటవుుల్ని నిర్ణరుుంచే స్థారుులో మైనార్టీ ఓటర్లు. బీసీ ఓట్లు కూడా కీలకమే ప్రస్తుతం బరిలో నిలిచింది: 12 ప్రధాన అభ్యర్థులు వీరే.. జి. ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్) సి క్రాంతి కుమార్ (వైఎస్సార్ సీపీ) కొండ్రు పుష్పలీల (బీజేపీ) బి. సంజీవరావు (టీఆర్ఎస్) చిలుకూరి అయ్యుప్ప, సాక్షి, రంగారెడ్డి జిల్లా: మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌పై గెలుపునకు ప్రత్యర్థులు వ్యూహాలకు పదునుపెట్టారు. వికారాబాద్‌కు మంజీర నీటి సరఫరా అయోమయంగా మారడం, మరోవైపు శాటిలైట్ టౌన్షిప్ పనులు నత్తనడక సాగుతుండడంతో వీటినే ప్రచారాస్త్రాలుగా ఎన్నుకుని పోటీలోకి దిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని తిరగదోడుతూ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కత్తులు నూరుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు లేవంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వురోవైపు కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యవువుంటూ సంజీవరావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తరపున బరిలోకి దిగన కొండ్రు పుష్పలీల నరేంద్రమోడీ చరిష్మాతో అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరపున పోటీకి దిగిన క్రాంతికుమార్ వైఎస్ సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రంగా ముందుకెళ్తున్నారు. వైఎస్ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలతో ప్రతి కుటుంబం లబ్ధిపొందడంతో ఆయన తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. మైనార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని అంచనా వేస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కువగా ఎస్సీ ఓటర్లే అరుునా బీసీ, మైనార్టీ ఓట్లే ఇక్కడ కీలకం. నే.. గెలిస్తే.. ప్రతిగ్రామానికీ మంజీరా నీటి సరఫరా. గ్రామాలకు రోడ్లు, బస్సు సౌకర్యం. అనంతగిరి టీబీ శానిటోరియాన్ని తరలించకుండా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్పు. వైఎస్ ఆశయాలకు అనుగుణంగా ఇల్లులేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇళ్ల నిర్మాణం. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో మినీ స్టేడియం ఏర్పాటు. - క్రాంతి కుమార్ (వైఎస్సార్ సీపీ) వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేలా కృషిచేస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకంతో సాగునీరు. ప్రజలకు తాగునీరు అందిస్తా. ప్రభుత్వ మెడికల్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మహిళలకు ప్రత్యేక కళాశాలలు ఏర్పాటు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు. అనంతగిరిని టూరిజం కేంద్రంగా ఏర్పాటు. - బి.సంజీవరావు (టీఆర్ఎస్) జూరాల ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాకు చర్యలు. మంజీరానీరు అన్నిప్రాంతాలకు సరఫరాకు చర్యలు యువతకు ఉపాధి కోసం చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమల ఏర్పాటు. మెడికల్ కళాశాల, గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు. - గడ్డం ప్రసాద్ కుమార్ (కాంగ్రెస్) శాటిలైట్ టౌన్షిప్ పనులు త్వరితగతిన పూర్తి. వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు రైల్వే సౌకర్యాలు మరింత మెరుగయ్యేలా కృషి. అనంతగిరిని టూరిజం ప్రాంతంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా. - కొండ్రు పుష్పలీల (బీజేపీ)