‘మాజీల పోరు’లో గెలిచేదెవరో.. | who will be win in Vikarabad assembly elections ? | Sakshi
Sakshi News home page

‘మాజీల పోరు’లో గెలిచేదెవరో..

Published Fri, Apr 18 2014 1:35 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

‘మాజీల పోరు’లో గెలిచేదెవరో.. - Sakshi

‘మాజీల పోరు’లో గెలిచేదెవరో..

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన వికారాబాద్‌లో ఈసారి ఇద్దరు మాజీ మంత్రుల మధ్య రసవత్తర పోటీ జరుగనుంది.  2008 ఉప ఎన్నికల్లో వూజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ (టీఆర్‌ఎస్)పై కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు.  2009 సాధారణ ఎన్నికల్లో ఆయనే విజయం సాధించి.. కిరణ్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా  ఈ సీటు బీజేపీకి ఇచ్చారు. మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. మాజీ జెడ్పీటీసీ బి. సంజీవరావు అనూహ్యంగా టీఆర్‌ఎస్ టికెట్ దక్కించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్రాంతికుమార్ పోటీలో ఉన్నారు. తెలంగాణ అంశం కీలకంగా వూరిన ఈ ఎన్నికలు ప్రసాద్‌కుమార్‌కు సవాలుగా మారాయి.
 
వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం:
ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 8, టీడీపీ -4, టీఆర్‌ఎస్-1, ఇండిపెండెంట్-1
 ప్రస్తుత ఎమ్మెల్యే: ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్)
 రిజర్వేషన్: ఎస్సీ
నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం అధికం. ఎస్సీ ఓటర్లే ఎక్కువ. గెలుపు, ఓటవుుల్ని నిర్ణరుుంచే స్థారుులో మైనార్టీ ఓటర్లు. బీసీ ఓట్లు కూడా కీలకమే
 ప్రస్తుతం బరిలో నిలిచింది: 12
 
 ప్రధాన అభ్యర్థులు వీరే..
 జి. ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్)
 సి క్రాంతి కుమార్ (వైఎస్సార్ సీపీ)
 కొండ్రు పుష్పలీల (బీజేపీ)
 బి. సంజీవరావు (టీఆర్‌ఎస్)
 
చిలుకూరి అయ్యుప్ప, సాక్షి, రంగారెడ్డి జిల్లా: మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌పై గెలుపునకు ప్రత్యర్థులు వ్యూహాలకు పదునుపెట్టారు. వికారాబాద్‌కు మంజీర నీటి సరఫరా అయోమయంగా మారడం, మరోవైపు శాటిలైట్ టౌన్‌షిప్ పనులు నత్తనడక సాగుతుండడంతో వీటినే ప్రచారాస్త్రాలుగా ఎన్నుకుని పోటీలోకి దిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని తిరగదోడుతూ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కత్తులు నూరుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు లేవంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
 
 వురోవైపు కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యవువుంటూ  సంజీవరావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తరపున బరిలోకి దిగన కొండ్రు పుష్పలీల నరేంద్రమోడీ చరిష్మాతో అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరపున పోటీకి దిగిన క్రాంతికుమార్ వైఎస్ సంక్షేమ పథకాలే  ప్రచారాస్త్రంగా ముందుకెళ్తున్నారు. వైఎస్ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలతో ప్రతి కుటుంబం లబ్ధిపొందడంతో ఆయన తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. మైనార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని అంచనా వేస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.  ఎక్కువగా ఎస్సీ ఓటర్లే అరుునా బీసీ, మైనార్టీ ఓట్లే ఇక్కడ కీలకం.  
 
 నే.. గెలిస్తే..
 ప్రతిగ్రామానికీ మంజీరా నీటి సరఫరా.
 గ్రామాలకు రోడ్లు, బస్సు సౌకర్యం.
అనంతగిరి టీబీ శానిటోరియాన్ని తరలించకుండా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్పు.
 వైఎస్ ఆశయాలకు అనుగుణంగా ఇల్లులేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇళ్ల నిర్మాణం.
 నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో మినీ స్టేడియం ఏర్పాటు.
 - క్రాంతి కుమార్ (వైఎస్సార్ సీపీ)
 
వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా  ఏర్పాటు చేసేలా కృషిచేస్తా.
పాలమూరు ఎత్తిపోతల పథకంతో సాగునీరు.
ప్రజలకు తాగునీరు అందిస్తా.
ప్రభుత్వ మెడికల్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మహిళలకు ప్రత్యేక  కళాశాలలు ఏర్పాటు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు.
అనంతగిరిని  టూరిజం కేంద్రంగా ఏర్పాటు.
 - బి.సంజీవరావు (టీఆర్‌ఎస్)
 
 జూరాల ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాకు చర్యలు.
 మంజీరానీరు అన్నిప్రాంతాలకు సరఫరాకు చర్యలు
 యువతకు ఉపాధి కోసం చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమల ఏర్పాటు.
 మెడికల్ కళాశాల, గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు.               
 - గడ్డం ప్రసాద్ కుమార్ (కాంగ్రెస్)
 
శాటిలైట్ టౌన్‌షిప్ పనులు త్వరితగతిన పూర్తి.
వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు
రైల్వే సౌకర్యాలు మరింత మెరుగయ్యేలా కృషి.
అనంతగిరిని టూరిజం ప్రాంతంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా.
ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా.
 - కొండ్రు పుష్పలీల (బీజేపీ)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement