vikarabad assembly constituency
-
ఆ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ దక్కేనా? ఓటర్ల నాడి ఎలా?
జిల్లాల విభజనలో తెలంగాణ ఊటీగా పేరున్న అనంతగిరి కొండల చుట్టూ విస్తరించిన వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది. ఈ జిల్లాలో మూడు గ్రామీణ నియోజకవర్గాలే ఉన్నాయి. వికారాబాద్, పరిగి, తాండూరు సెగ్మెంట్లలో పాలిటిక్స్ఎలా ఉన్నాయో చూద్దాం. పార్టీలు పాతవారికే ఛాన్స్ఇస్తాయా? కొత్తవారికి అవకాశం కల్పిస్తాయా? అసలు ఓటర్ల నాడి ఎలా ఉంది? త్రిముఖపోటీలో ఎవరిది పైచేయి కాబోతోంది? గత ఎన్నికల్లో ఇద్దరు మాజీ మంత్రులను ఢీకొని వికారాబాద్ నుంచి విజయం సాధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు ప్రస్తుతం పార్టీలో వర్గపోరు తలపోటుగా మారింది. దీంతో పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి.. సొంత క్యాడర్ నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యే తీరుపై రగిలిపోతున్న సీనియర్లు వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ నేతను బరిలో దించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండే టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లుతో పోటీ చేయించాలని కొందరు స్థానిక నేతలు పట్టుబడుతున్నారు. దళితబంధు పథకంపై ప్లీనరీలో మాట్లాడి సీఎం కేసీఆర్ దగ్గర ఆనంద్ మార్కులు కొట్టేశారు. వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిపై ఆనంద్ వర్గీయులు దాడి చేయడం.. దాడి చేసిన కార్యకర్తకు టీఆర్ఎస్ యూత్ వింగ్ మండల అధ్యక్షుడిని చేయడం వివాదంగా మారింది. క్యాడర్‌ను కాపాడుకుంటూ ముందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లైన్ క్లియర్‌గా ఉంది. పార్టీ నుంచి చాలా మంది నాయకులు వెళ్ళిపోయినా వికారాబాద్‌లో క్యాడర్‌ను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రసాద్‌కుమార్. గత ఎన్నికల్లో 3వేల ఓట్ల తేడాతోనే ఓడిన ప్రసాద్.. వచ్చే ఎన్నికల్లో గెలవాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. బీజేపీకి వేవ్ కలిసొచ్చేనా? బీజేపీ వికారాబాద్నియోజకవర్గంలో పుంజుకుంటోంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ దాదాపుగా 23 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేయడం.. లోకల్‌గా పట్టుఉండటం... బీజేపీ వేవ్ కలిసివస్తాయని భావిస్తున్నారు. కొప్పుల బ్రదర్స్‌మధ్య విభేదాలు పరిగి ఎమ్మెల్యేగా కొప్పుల మహేశ్‌రెడ్డి మొదటిసారి ఎన్నికయ్యారు. మహేశ్‌రెడ్డి సోదరుడు అనిల్‌రెడ్డి చాలా యాక్టివ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల అన్నదమ్ముల మధ్య కోల్డ్వార్మొదలైనట్టు పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని నేరుగా కేటీఆర్‌ను కలిసి అనిల్‌రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. కొప్పుల బ్రదర్స్‌మధ్య విభేదాలు తలెత్తడంతో మూడో వ్యక్తి ఎంటరయ్యాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్బి.మనోహర్‌రెడ్డి పరిగి నియోజకవర్గంలో క్యాడర్‌ను పెంచుకునే పనిలో పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ఆశించి భంగపడ్డ మనోహర్.. కేటీఆర్సపోర్ట్తో జిల్లా బ్యాంక్‌ఛైర్మన్‌పదవి దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మరోసారి అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సమర్ధవంతుడైన నాయకుడి కోసం అన్వేషిస్తోంది. ఎన్నికల నాటికి అధికార పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేయడమే బిజేపీ స్కెచ్ గా కనిపిస్తుంది. తాండూరు టీఆర్ఎస్లో వర్గపోరు తాండూరు టిఆర్ఎస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో నేనంటే నేనే అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రోహిత్ రెడ్డి...మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత రోహిత్ టిఆర్ఎస్ లో చేరడం..అధిష్టానం వద్ద పట్టు సాధించడంతో పట్నం మహేందర్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారాడు. ఎమ్మెల్యేగా ఓడినా మహేందర్ రెడ్డి.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి పట్టు నిలుపుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వివాదం సద్దుమణగని పక్షంలో మంత్రి సబితారెడ్డిని తాండూరు బరిలో దించాలని అధిష్టానం భావిస్తోందని సమాచారం. సబితారెడ్డి పుట్టిల్లు తాండూరు కావడం.. ఎన్నికల్లో ఆమెకు కలిసొస్తుందని ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీలో లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రత్యర్థి పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎంఐఎం పోటీలో ఉంటే ఫలితం తారుమారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేష్‌కు.. గత ఎన్నికల్లో పార్టీ టికెట్ చేతిదాక వచ్చి జారిపోయింది. చివరి నిమిషంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తన అనుచరుడైన రోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆ తరువాత రోహిత్ పార్టీ మారి కొండా విశ్వేశ్వరరెడ్డికి దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని గెలవాలని రమేష్ భావిస్తున్నారు. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో ఇక్కడ డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం పార్టీలో రమేష్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీలో బిజేపీకి పట్టు ఉండటం కలిసొస్తుందని రమేష్ భావిస్తున్నారు. ప్రధాన పార్టీలకు ధీటుగా ఎంఐఎం కూడా తాండూరులో పావులు కదుపుతోంది. ఎంఐఎం పోటీలో దిగితే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. -
ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా
సాక్షి, వికారాబాద్: ఇటీవల కాలంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఫైర్ అయ్యారు. తనకు రాజకీయాలు కొత్త అన్న మాజీ మంత్రిని ఉద్దేశిస్తూ.. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2018 ఎన్నికల్లో ప్రజలు తమ నాయకుడు కేసీఆర్‌పై నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని, మోదీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. గ్రామపంచాయతీల్లో రాష్ట్ర నిధులు లేవనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌ని హిందువా అంటున్న బండి సంజయ్‌లో ప్రవహించేది హిందూ రక్తమే అయితే నాగార్జున సాగర్ ఎన్నికల్లో చూసుకుందామని ఛాలెంజ్ చేశారు. హిందువులకు, ముస్లింలకు వేరువేరు రక్తం ఉంటుందా అని ఆయన ఎద్దేవా చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌పై అవాక్కులు చవాక్కులు పేలితే బడిత పూజ చేస్తామని హెచ్చరించారు. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలను బీజేపీ ఇకనైనా మానుకోవాలని సూచించారు. గాలివాటంగా గెలిచిన స్థానాలను చూసుకొని బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నాడని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ క్లాస్ కి క్లాస్, మాస్ కి మాస్ అని, ఆయన తలచుకుంటే బీజేపీ నాయకులు రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు. -
‘మాజీల పోరు’లో గెలిచేదెవరో..
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన వికారాబాద్‌లో ఈసారి ఇద్దరు మాజీ మంత్రుల మధ్య రసవత్తర పోటీ జరుగనుంది. 2008 ఉప ఎన్నికల్లో వూజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ (టీఆర్ఎస్)పై కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఆయనే విజయం సాధించి.. కిరణ్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి ఇచ్చారు. మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. మాజీ జెడ్పీటీసీ బి. సంజీవరావు అనూహ్యంగా టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్రాంతికుమార్ పోటీలో ఉన్నారు. తెలంగాణ అంశం కీలకంగా వూరిన ఈ ఎన్నికలు ప్రసాద్‌కుమార్‌కు సవాలుగా మారాయి. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం: ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 8, టీడీపీ -4, టీఆర్ఎస్-1, ఇండిపెండెంట్-1 ప్రస్తుత ఎమ్మెల్యే: ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్) రిజర్వేషన్: ఎస్సీ నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం అధికం. ఎస్సీ ఓటర్లే ఎక్కువ. గెలుపు, ఓటవుుల్ని నిర్ణరుుంచే స్థారుులో మైనార్టీ ఓటర్లు. బీసీ ఓట్లు కూడా కీలకమే ప్రస్తుతం బరిలో నిలిచింది: 12 ప్రధాన అభ్యర్థులు వీరే.. జి. ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్) సి క్రాంతి కుమార్ (వైఎస్సార్ సీపీ) కొండ్రు పుష్పలీల (బీజేపీ) బి. సంజీవరావు (టీఆర్ఎస్) చిలుకూరి అయ్యుప్ప, సాక్షి, రంగారెడ్డి జిల్లా: మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌పై గెలుపునకు ప్రత్యర్థులు వ్యూహాలకు పదునుపెట్టారు. వికారాబాద్‌కు మంజీర నీటి సరఫరా అయోమయంగా మారడం, మరోవైపు శాటిలైట్ టౌన్షిప్ పనులు నత్తనడక సాగుతుండడంతో వీటినే ప్రచారాస్త్రాలుగా ఎన్నుకుని పోటీలోకి దిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని తిరగదోడుతూ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కత్తులు నూరుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు లేవంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వురోవైపు కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యవువుంటూ సంజీవరావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తరపున బరిలోకి దిగన కొండ్రు పుష్పలీల నరేంద్రమోడీ చరిష్మాతో అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరపున పోటీకి దిగిన క్రాంతికుమార్ వైఎస్ సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రంగా ముందుకెళ్తున్నారు. వైఎస్ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలతో ప్రతి కుటుంబం లబ్ధిపొందడంతో ఆయన తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. మైనార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని అంచనా వేస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కువగా ఎస్సీ ఓటర్లే అరుునా బీసీ, మైనార్టీ ఓట్లే ఇక్కడ కీలకం. నే.. గెలిస్తే.. ప్రతిగ్రామానికీ మంజీరా నీటి సరఫరా. గ్రామాలకు రోడ్లు, బస్సు సౌకర్యం. అనంతగిరి టీబీ శానిటోరియాన్ని తరలించకుండా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్పు. వైఎస్ ఆశయాలకు అనుగుణంగా ఇల్లులేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇళ్ల నిర్మాణం. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో మినీ స్టేడియం ఏర్పాటు. - క్రాంతి కుమార్ (వైఎస్సార్ సీపీ) వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేలా కృషిచేస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకంతో సాగునీరు. ప్రజలకు తాగునీరు అందిస్తా. ప్రభుత్వ మెడికల్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మహిళలకు ప్రత్యేక కళాశాలలు ఏర్పాటు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు. అనంతగిరిని టూరిజం కేంద్రంగా ఏర్పాటు. - బి.సంజీవరావు (టీఆర్ఎస్) జూరాల ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాకు చర్యలు. మంజీరానీరు అన్నిప్రాంతాలకు సరఫరాకు చర్యలు యువతకు ఉపాధి కోసం చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమల ఏర్పాటు. మెడికల్ కళాశాల, గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు. - గడ్డం ప్రసాద్ కుమార్ (కాంగ్రెస్) శాటిలైట్ టౌన్షిప్ పనులు త్వరితగతిన పూర్తి. వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు రైల్వే సౌకర్యాలు మరింత మెరుగయ్యేలా కృషి. అనంతగిరిని టూరిజం ప్రాంతంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా. - కొండ్రు పుష్పలీల (బీజేపీ)