
సాక్షి, నల్లగొండ: కరోనా వేళ.. బాజాభజంత్రీలు లేవు. చుట్టాలు, పక్కాలు లేరు. విందు అసలే లేదు. కేవలం పది మందితోనే కల్యాణాన్ని ముగించారు. నల్లగొండకు చెందిన నవీన్‌గౌడ్, నకిరేకల్‌కు చెందిన వర్షిణిలకు ఫిబ్రవరి 27న వివాహ నిశ్చితార్థం అయ్యింది. అదే రోజు ఏప్రిల్ 18న ముహూర్తం నిర్ణయించారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా వేయాలనుకున్నా.. వీరి పేర్ల మీద ఏడాది వరకు ముహూర్తాలు లేవని పంతులుగారు చెప్పారు. దీంతో నిర్ణీత ముహూర్తానికే పెళ్లి జరపాలని నిశ్చయించుకొని అధికారుల అనుమతి తీసుకున్నారు. నల్లగొండలోని అభయాంజనేయ, ఉమామహేశ్వర దేవాలయంలో శనివారం ఈ పెళ్లి తంతు జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment