వివాహిత అదృశ్యం | Married woman missing | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

Published Tue, Mar 15 2016 8:24 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Married woman missing

కీసర (రంగారెడ్డి) : ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. కీసర ఎస్.ఐ విష్ణువర్థన్‌ రెడ్డి తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. చీర్యాల గ్రామానికి చెందిన కరినే మాధవి(25) ఈ నెల 13 వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేదు.

బంధువులను విచారించినా, చుట్టుపక్కల ప్రాంతాలను గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం సాయంత్రం మాధవి భర్త రాముడు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు. మాధవికి ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement