
సాక్షి, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎమ్‌సీలు కాగా, ప్రస్తుతం 89 టీఎమ్‌సీల నీరు నిల్వఉంది. మహారాష్ట్ర, నిజామాబాద్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులకు చేరింది. జులై మూడో వారం నాటికి ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీ ఐదు టీఎమ్‌సీలకు చేరుకోగా రెండు నెలల కాలంలోనే పూర్తిగా జలకళను సంతరించుకోవడం విశేషం. ఈ సందర్భంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.