maximum water level
-
మూడేళ్ల తర్వాత నిండిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
సాక్షి, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎమ్సీలు కాగా, ప్రస్తుతం 89 టీఎమ్సీల నీరు నిల్వఉంది. మహారాష్ట్ర, నిజామాబాద్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులకు చేరింది. జులై మూడో వారం నాటికి ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీ ఐదు టీఎమ్‌సీలకు చేరుకోగా రెండు నెలల కాలంలోనే పూర్తిగా జలకళను సంతరించుకోవడం విశేషం. ఈ సందర్భంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మరో పది అడుగులే..
శివమొగ్గ : జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రముఖ జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. వానలు తగ్గడంతో వరదలు వచ్చిన ప్రాంతాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి. గత 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమకనుమల ప్రదేశాలైన మాణి డ్యాంలో 65 మిల్లీమీటర్లు, యడూరి 72 మి.మీ, హులికల్లు 70 మి.మీ, మాస్తీకట్టె 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శివమొగ్గ 9.20 మి.మీ, తీర్థహళ్లి 72 మి.మీ, సాగర 15.40 మి.మీ, శికారిపుర 8.60 మి.మీ, సొరబ 16.40 మి.మీ, హొసనగర 21.20 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఏడు తాలూకాల్లో 97.60 మి.మీ. వర్షపాతం నమోదైంది. లింగనమక్కి డ్యాం భర్తీకి పది అడుగులు మాత్రమే రాష్ట్రంలో ప్రముఖ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి డ్యాం భర్తీకి ఇక పది అడుగులు మాత్రమే మిగిలింది. డ్యాం గరిష్ట నీటిమట్టం 1,819 అడుగులు కాగా, శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం నీటిమట్టం 1809.45 అడుగులకు చేరుకుంది. జలాశయ పరిసరాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతో డ్యాం ఇన్‌ఫ్లో 32,424 క్యూసెక్కులకు తగ్గింది. ఇక భద్రా జలాశయ నీటిమట్టం 186 అడుగులు కాగా, ఇప్పటికే గరిష్ట స్థాయి 184.10 అడుగులకు చేరుకుంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 29,667 క్యూసెక్కులు ఉండగా, అందులో 26,091 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగా జలాశయం ఇప్పటికే గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుండగా, అంతే పరిమాణంలో విడుదల చేస్తున్నారు. మాణి జలాశయం గరిష్ట నీటిమట్టం 594.36 అడుగులు కాగా, ప్రస్తుతం డ్యాంలో 586.63 అడుగుల నీరున్నాయి. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 4,484 క్యూసెక్కులు ఉంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో పొంగి పొర్లుతున్న తుంగా, భద్రా, వరదా నదులు శాంతించాయి. ఎడతెరపిలేని వానల కారణంగా జిల్లాలో సుమారు రూ.100 కోట్లు న ష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. -
మురిసిన మూసీ
సూర్యాపేటరూరల్, కేతేపల్లి, న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన వర్షాలకు మూసీ ఎగువ ప్రాంతాల నుంచి మూసీ ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో మూడేళ్ల తర్వాత అధికారులు ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 644.5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం సాయంత్రం 4, 6వ నంబర్ క్రస్ట్‌గేట్లను అడుగు మేర ఎత్తి 1300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. కనీస నీటిమట్టం 644 అడుగులు ఉండేలా చూస్తూ నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ ఈఈ అమీద్‌ఖాన్ తెలిపారు. దిగువ ప్రాంతాల్లోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమలో మూసీ డీఈ శంక ర్‌రెడ్డి, దేవరకొండ డీఈ సురేందరావు, ఏఈ రమేష్, జేఈలు నవీన్, సత్యనారాయణ, రామకృష్ణ, అజయ్‌యాదవ్ పాల్గొన్నారు. కాగా మూసీ గేట్లు ఎత్తినట్లు తెలియడంతో సమీప ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున ప్రాజెక్టు వద్దకు తరలివచ్చారు. మూసీ అందాలను చూస్తూ సందడి చేశారు. ఆరేళ్లలో మూడుసార్లు గేట్ల ఎత్తివేత ఆరేళ్ల కాలంలో మూసీ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను మూడుసార్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. తూపాన్ ప్రభావంతో 2008లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు చేయడంతో తొమ్మిది గేట్లను నెల రోజుల పాటు ఎత్తి ఉంచి రికార్డు స్థాయిలో 10 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. 2009లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. 2010 ఆగస్టులో మళ్లీ ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 20 రోజుల పాటు గేట్లు ఎత్తి ఉంచారు. 2011లో ప్రాజెక్టులో నీటిమట్టం 633 అడుగులకు మించకపోవడంతో ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు నింపడానికి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలారు. 2012లో నీటిమట్టం 641 అడుగులు దాట లేదు. ప్రస్తుతం ఆగస్టులోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం, రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.