టెన్త్ ఇంగ్లిష్‌లో మాయాబజార్!!
చిలుకూరు : టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో ఈసారి సినిమాకు చోటు కల్పించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పదోతరగతి చదివే విద్యార్థులకు మారిన సిలబస్‌తో కొత్త పుస్తకాలు అందుబాటులో వచ్చాయి. ఇంగ్లిష్ సబ్జెక్ట్ లో నాలుగో పాఠం (టాపిక్: ఫిలిమ్స్ అండ్ థియేటర్) పూర్తిగా సిని మాలకు సంబంధించి ఉంది. మూడు భాగాలుగా ఉన్న ఈ పాఠ్యాంశంలో మొదటి అంశం(ఏ)గా బెంగాలీ ప్రముఖ డెరైక్టర్ సత్యజిత్‌రే, రెండవ అంశం(బీ) మాయాబజార్ తెలుగు సినిమా, మూడో అంశం(సీ) మహానటి సావిత్రి గురించి వివరించారు. చదువుతో పాటు విద్యార్థులకు సినిమాలపై అవగాహన ఉండేం దుకు ఇలా చేసి ఉండవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు.