సాక్షి, హైదరాబాద్: భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య)-ఎంసీపీఐ యు-3వ అఖిల భారత జాతీయ మహాసభలను 2015 మార్చి 24 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. వీటి కోసం మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అధ్యక్షతన ఆ హ్వాన సంఘం ఏర్పాటైం ది. వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కేఆర్ చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌస్, తాండ్ర కుమార్, వనం సుధాకర్ తదితరులు ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా ఉన్నారు.