మూడు చోట్ల మెట్రో ‘మలుపులు’ | metro rail | Sakshi
Sakshi News home page

మూడు చోట్ల మెట్రో ‘మలుపులు’

Published Sun, Nov 16 2014 2:06 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

మూడు చోట్ల మెట్రో ‘మలుపులు’ - Sakshi

మూడు చోట్ల మెట్రో ‘మలుపులు’

అలైన్‌మెంట్ మార్పునకు ఎల్ అండ్ టీ ఓకే..  
 సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మూడుచోట్ల మెట్రోరైలు అలైన్‌మెంట్ మార్చడానికి నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అలైన్‌మెంట్ మార్పు వల్ల పెరిగే నిర్మాణ భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు అసెంబ్లీ, సుల్తాన్‌బజార్, పాతబస్తీలోని వివిధ ప్రార్ధనా మంది రాల వద్ద మార్పులు చేస్తారు. అలైన్‌మెంట్ మార్పుతో పాటు, కొత్త అలైన్‌మెంట్ నమూనాపై ఈ నెల 20న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు పురోగతిపై  శనివారం సచివాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎ.ఎం.నాయక్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శంకర్ రామన్, హైదరాబాద్ మెట్రో ఎండీ వీబీ గాడ్గిల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, హెచ్‌ఎండీఏ కమిషనర్ ప్రదీప్ చంద్ర, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, కలెక్టర్ మీనా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌తో సమీక్షించారు.
 
 72 కి.మీ. నుంచి 200 కి.మీ.లకు
 
 తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ప్రాజెక్టు పురోగతికి సహకరిస్తున్నా.. ప్రజల్లో అనుమానాలు తలెత్తేలా  కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇందుకు ఎల్ అండ్ టీ రాసిన లేఖలు వారికి ఉపయోగపడ్డాయని సీఎం కేసీఆర్ అన్నారు. 72 కిలోమీటర్ల మెట్రోరైలును 200 కిలోమీటర్లకు పొడిగించడానికి నిర్ణయించామని, రెండో దశలో ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇవేవీ పట్టించుకోకుండా ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో నిర్మాణం నుంచి వైదొలగిపోతుందని, మెట్రోరైలు ప్రాజెక్టు ఆగిపోతుందని ప్రచారం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎల్ అండ్ టీ చైర్మన్ నాయక్ స్పందిస్తూ తాము ప్రభుత్వానికి రాసిన లేఖల వల్ల ఇబ్బందులు తలెత్తడం దురదృష్టకరమన్నారు. ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నిర్మించే థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, రహదారుల నిర్మాణంలో తమకూ అవకాశం కల్పించాలని సీఎంను కోరారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ టవర్ల నిర్మాణంలోనూ పాల్గొంటామని చెప్పారు.
 
 మూడింటిపై అభ్యంతరాలు
 
 మెట్రోరైలుపై మొదట్నుంచీ మూడు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని సీఎం అన్నా రు. అసెంబ్లీతో పాటు, అమరవీరుల స్తూపంతో తమకు భావోద్వేగ బంధం ఉందన్నారు. అసెం బ్లీ ముందు నుంచి కాకుండా వెనుక నుంచి లైను వేయాలని, సుల్తాన్‌బజార్ నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కాలేజీ నుంచి తీసుకెళ్లాలని, పాతబస్తీలో ప్రార్థనా మందిరాల పక్క నుంచి కాకుండా మరోచోట నుంచి లైను వేయాలని ఎల్ అండ్ టీకి సూచించారు.
 
 
 తెలంగాణ వచ్చాక రాజకీయాలనుంచి తప్పుకోవాలనుకున్నా: కేసీఆర్
 
 తెలంగాణలో అభివృద్ధి ఆగిపోవాలని, రాష్ట్రం ఇబ్బందులు పడాలని కొన్ని ఆంధ్రా శక్తులు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటైన తరువాతే మెట్రోరైలు పనుల్లో వేగం పెరిగిందన్నారు. తెలంగాణ వచ్చాక రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించానని, అయితే ఆంధ్రా శక్తులు ఈ రాష్ట్రాన్ని బతకనీయవని అర్థమైందని చెప్పారు. నీళ్లు, ఉద్యోగాలు, కరెంటు విషయంలో పేచీలు పెడ్తారని, హైదరాబాద్ విషయంలోనూ రాద్ధాంతం చేస్తారని, వారి కుట్రలను తిప్పికొట్టాలనే రాజకీయాల నుంచి తప్పుకోకుండా బాధ్యతలు స్వీకరించినట్లు వ్యాఖ్యానించారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని ఆంధ్రా శక్తులు కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రాన్ని నంబర్‌వన్ చేయడానికి తాను రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు ఆయన ఎల్ అండ్ టీ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ చారిత్రక ప్రాధాన్యత చెరిగిపోకుండా అభివృద్ధి చేయాలన్నదే తమ తపన అని, అందుకోసమే మెట్రోరైలు లైనులో మార్పులు సూచించినట్లు వెల్లడించారు. మెట్రోరైలుకు అవసరమైన రైట్ ఆఫ్ వే ఇవ్వడానికి కలిగే ఇబ్బందులను అధిగమించి వెంటనే భూములు అప్పగిస్తామని సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
 
 వారంలో వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్
 పంచాయతీరాజ్‌మంత్రి, అధికారులతో సీఎం సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ పనులకు డిసెంబర్‌లో శంకుస్థాపన చేయనున్నట్టు, ఇందుకోసం వారంలోగా వాటర్‌గ్రిడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ఇతర అధికారులతో వాటర్‌గ్రిడ్‌పై శ నివారం సీఎం సమీక్షించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను నిర్మించాలని అధికారులకు సూచిం చారు. నిర్ణీత  సమయంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాలద్వారా మంచినీరు అందించాల్సి ఉన్నందున, గ్రిడ్‌పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇంటింటికీ నల్లాల ఏర్పాటు నిమిత్తం 7.5 కోట్ల మీటర్ల పైప్‌లైన్ కావాల్సి ఉన్నందున, డివిజన్ల వారీగా అంచనాలను తయారు చేయాలన్నారు. తెలంగాణలో పైపుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే కంపెనీలనే టెండర్లకు ఆహ్వానించాలని అన్నారు.
 
 మహిళలతో నీటిసరఫరా కమిటీలు
 
 వాటర్‌గ్రిడ్ పనులను పర్యవేక్షించడంలో ప్రజ లను భాగస్వాములను చేయడానికి ప్రతి గ్రామంలోనూ గ్రామీణ మంచినీటి సరఫరా కమిటీలను వేయాలని సీఎం సూచించారు. సర్పంచ్ అధ్యక్షులుగా ఉండే ఈ కమిటీలో సభ్యులంతా మహిళలే ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement