ఆగిన బడిఅన్నం | Midday meal stoped at govt school | Sakshi
Sakshi News home page

ఆగిన బడిఅన్నం

Published Tue, Jan 20 2015 3:35 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

ఆగిన బడిఅన్నం - Sakshi

ఆగిన బడిఅన్నం

ఆర్మూర్ :జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో మ ధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు సోమవారం ఒక రోజు సమ్మెకు దిగడంతో విద్యార్థులు పస్తులుం డాల్సిన పరిస్థితి నెలకొంది. ఏజెన్సీల నిర్వాహకులు రెండు వారాల ముందుగానే ఉన్నతాధికారులకు నో టీసులు ఇచ్చినా, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో విద్యార్ధుల కడుపులు మాడాల్సి వచ్చింది.

జిల్లా లో 25 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 461 జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాలలు, 265 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,573 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 2,303 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 4,500 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరు రోజూ దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. ఇందుకోసం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.4.35, ఆరో తరగతి నుంచి పదో తర గతి వరకు ఒక్కో విద్యార్థికి ఆరు రూపాయలను ప్రభుత్వం ఏజెన్సీల నిర్వాహకులకు చెల్లిస్తుంది.

విద్యార్థుల సంఖ్య 25 లోపు ఉన్న పాఠశాల ఏజెన్సీ నిర్వాహకులకు రూ.వెయ్యి, 25 నుంచి వంద వరకు విద్యార్థుల సంఖ్య ఉంటే రూ. రెండు వేలు, 200 మందికి పైగా విద్యార్థులుంటే రూ. మూడు వేల గౌరవ వేతనాన్ని ఇస్తుంది. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. దీంతో స్లాబ్ రేట్ ప్రకారం రావాల్సిన మొత్తం, గౌరవ వేతనం కలిపి సుమారు రూ. 11.36 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఏజెన్సీల నిర్వాహకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సమ్మెకు దిగుతున్నట్లు డీఈఓ శ్రీనివాసాచారికి ఈ నెల రెండున నోటీసులు అందజేసారు.
 
గ్రామీణ ప్రాంతాలకు చేరని సమాచారం
సమ్మె విషయం రెండు వారాల కిందటే జిల్లాస్థాయి అధికారులకు తెలిసినా, సంక్రాంతి, వరుస సెలవుల కారణంగా గ్రామీణ పాఠశాలలకు సమాచారం చేరలేదు. తెలిసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సోమవారం టిఫిన్ తీసుకొని రావాలని సూచించారు. సమాచారం చేరని పాఠశాలలలో విద్యార్థులు పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. కొం దరు విద్యార్థులు ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చారు.  
 
నిరవధిక సమ్మెకు ఏజెన్సీల నిర్వాహకులు!
ఒక రోజు సమ్మెతో సమస్య తీవ్రతను తెలుసుకున్న అధికారులు కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపారు. వారం రోజులలో బకాయిలన్నింటినీ చెల్లిస్తామని అధికారులు తెలిపినట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి తెలిపారు. అయినా తాము, 15 రోజుల పాటు వేచి చూసి వచ్చే నెల రెండు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
 
కార్మికుల డిమాండ్లు ఇవి
అప్పు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న ఏజెన్సీ కార్మికులు ఏళ్ల తరబడి తమ డి మాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్న స్లాబ్ రేట్‌తో తాము మరింత అప్పులలో కూరుకు పోతున్నామంటున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.తొమ్మిది, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ. పది స్లాబ్ రేట్ కింద చెల్లించాలని డి మాండ్ చేస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల తరహాలో గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రతీ కార్మికునికి రూ. 6,500 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చే స్తున్నారు. రాజకీయ వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. తమ సమస్యలు అన్నింటినీ సానుభూతితో పరిశీలించి పరిష్కరించాల ని వారు కోరుతున్నారు.
 
డీఈఓ ఆఫీసు ఎదుట ధర్నా

నిజామాబాద్ అర్బన్ : పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం ఎదుట మ ధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ధర్నా నిర్వహిం చారు. మూడు నెలల బకాయిలను వెంట  నే విడుదల చేయాలని కోరారు. బిల్లులు అం   దక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్మికులకు వెంటనే గౌరవ వేతనం అందించాలని, సామాజిక బీమా సౌకర్యం క ల్పించాలని పేర్కొన్నారు. కనీస వేతనాలు అం దించి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

పాఠశాలలకు సబ్సిడీపై వంటగ్యాస్‌ను  సరఫరా చే యాలన్నారు. స్లాబ్ రేట్లను పెంచాలన్నారు. లే దంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.అనంతరం డీఈఓ శ్రీనివాసాచారికి వినతిపత్రం సమర్పించారు. బ కాయిల విషయం  ఉన్నతాధికారులకు విన్నవిం    చామని, రాగానే అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భోజన ఏజెన్సీ కా ర్మిక సంఘం నాయకులు భారతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement