
కొత్తగూడెం రూరల్: విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న తహసీల్దార్ అశోక్‌చక్రవర్తి
కొత్తగూడెంరూరల్ : పట్టణంలోని మేదర్‌బస్తీ ప్రభుత్వ పాఠశాలో అక్షయపాత్ర మధ్యాహ్నభోజనం పథకాన్ని తహసీల్దార్ అశోక్‌చక్రవర్తి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నభోజనాన్ని అక్షయపాత్ర వారు వడ్డిస్తారని తెలిపారు. విద్యార్శులు కష్టపడి చదువుకోవాలన్నారు. అనంతరం డీపీఆర్వో శ్రీనివాస్, ఎంఈఓ వెంకటరామయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పాల్గొన్నారు.
పాల్వంచలో...
పాల్వంచ : పట్టణంలోని వికలాంగుల కాలనీ, వెంగళరావుకాలనీ పాఠశాలలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజనాన్ని కార్మికులు శుక్రవారం అడ్డుకున్నారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. సంఘం జిల్లా నాయకులు అప్పారావు, కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా కష్టనష్టాలకు ఓర్చి విద్యార్థులకు భోజనం వండి పెట్టిన కార్మికులను అర్ధాంతరంగా మాన్పించడం అన్యాయం అన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ సుబ్బరావు అక్కడికి చేరుకుని ఆందోళన సద్దుమణిపించారు. కార్యక్రమంలో దొడ్డా రవికుమార్, రాజు, కార్మికులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం..
కొత్తగూడెం : అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేయనున్నట్లు లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ వశ్యానాయక్ అన్నారు. ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో మ«ధ్యాహ్న భోజన పంపిణీకు పూజలు చేశారు. సర్పంచ్, డీపీఆర్‌ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ దీని ద్వారా మారుమూల ప్రాంతాల విద్యార్థులకు సైతం పౌష్టికాహారం అందుతుందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మేకల జ్యోతిరాణి, ఎస్‌ఎంసీ చైర్మన్ ఏ.అనిల్, అంగన్‌వాడీ టీచర్లు విజయ, పుష్ప, సిబ్బంది ఇన్నయ్య, అరుణ పాల్గొన్నారు.
సుజాతనగర్‌లో..
సుజాతనగర్ : మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు భోజనం అందించే అక్షయపాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక పాఠశాలల్లో సర్పంచ్ లింగం పుష్పావతి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కృషి ద్వారా పిల్లలకు అక్షయపాత్రతో నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేములపల్లి సత్యనారాయణ, ఆర్‌ఐ నాగమణి, పంచాయతీ సెక్రటరీ జి.హరికృష్ణ, హెచ్‌ఎంలు సీహెచ్ వీరభద్రరావు, రత్న, గుణిరాం, టీఆర్‌ఎస్ నాయకులు దొడ్డి రామకృష్ణ, చింతలపూడి జగన్, లావుడ్యా గోపి, వెంకటకృష్ణ, సందీప్, పాల్గొన్నారు.
త్రీ ఇంక్లైన్‌లో...
చుంచుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకాన్ని మూడో ఇంక్‌లైన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బోడా శారద శుక్రవారం ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సముద్రాల సత్యనారాయణ, బోడా గణ్‌ష్ , ఉపాధ్యాయులు లక్ష్మణ్ తదితరులుపాల్గొన్నారు. విద్యానగర్ ప్రాథమిక పాఠశాలలో పథకాన్ని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు ప్రారంభించి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు నీరుకొండ హన్మంతరావు, దుర్గారావు, యాకూబీ, హెచ్‌ఎం అరుణ పాల్గొన్నారు.
అక్షయపాత్ర పేరుతో చద్దన్నం ...
సూపర్‌బజార్(కొత్తగూడెం) : అక్షయపాత్ర పేరుతో కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చద్దన్నం పెడుతున్నారని సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు విమర్శించారు. శుక్రవారం రామవరం నేతాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర పథకం వంటలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఎస్‌ఎంసీ చైర్మన్ ఎస్ జనార్దన్, హెచ్‌ఎం సంధ్యారాణి, వీఆర్‌ఓ లక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment