
సాక్షి, సిటీబ్యూరో: ‘తిందామంటే తిండి లేదు. చేద్దామంటే పనీ లేదు. పొట్ట గడవటం శానా కష్టంగా ఉంది. ఎవరైనా ఆదుకుంటారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నా. దయగల ప్రభువులు కూసింత అన్నం పెట్టి ఆదుకుంటారని అంతా తిరిగాను. ఎలాగోలా ఈ పూటకింత బువ్వ దొరికింది. దీంతో సర్దుకుంటా’నంటూ ఆవేదన వెలిబుచ్చింది కూకటిపల్లి వై జంక్షన్ సమీపంలోని శ్రీకాకుళం బస్తీకి చెందినఓ అవ్వ. ఎర్రటి ఎండలో ఆమె కాళ్లకు చెప్పులూ కూడా లేకుండా ఇలా సాక్షి కెమెరాకు చిక్కింది. – ఫొటో: రాజేష్‌రెడ్డి
కరోనా తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. వలసజీవులమనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఉండే కంటేసొంతూరుకు పోయి కలో గంజో తాగైనా బతుకుదామనే తపనతో ఇలా ఊరు బాట పడుతున్నారు. శుక్రవారం మేడ్చల్ రింగ్‌రోడ్డు వద్ద ఓ మహిళ స్వగ్రామానికి వెళ్లేందుకు ట్రక్కులోకి ఇలా అతి కష్టంగా ఎక్కుతున్న చిత్రంకనిపించింది.
..అలసాగరళంలో
ఆహా.. ఈ రహదారి పచ్చదనంతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో! ఓసారి దీనిపై అలా నడిచి వద్దామనుకునేరు సుమా. ఇది రోడ్డు కాదు. హుస్సేన్ సాగర్ జలాలపై పరుచుకున్నాయి వ్యర్థాలు. సాగర్ జలాలు కాలుష్యపూరితంగా ఎలా మారాయోఈ చిత్రాన్ని చూస్తే తెలుస్తోంది. ఒకప్పుడు స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన సాగర్ జలాలు ప్రస్తుతం రసాయన వ్యర్థాలతో విషపూరితంగా మారాయి. దీని ప్రక్షాళన ఎన్నటికి పూర్తయ్యేనో.. ఏమో!– ఫొటో: సురేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment