బొగ్గు ఉత్పత్తిలో చివరిస్థానంలో నిలిచిన అడ్య్రాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్
యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి జిల్లా) : నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరో 48 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ఇప్పటి వరకు 55.59మిలియన్ టన్ను ల ఉత్పత్తి లక్ష్యం కాగా 50.16 మిలియన్ టన్నులు(90శాతం) మాత్రమే సాధించింది. ఉత్పత్తిలో వెనుకబడిం ది. సింగరేణి వ్యాప్తంగా ఆరు ఏరియాలు వెనకంజలో ఉన్నాయి. భూగర్భ గనులు ఎక్కువగా ఉండటానికి తోడు, ఓసీపీల్లో ఓబీ వెలికితీతలో జాప్యం జరగడం.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యా ల సాధనపై ప్రభావం చూపుతోంది. సంస్థలో అడ్య్రాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్ కేవలం 18 శాతమే బొగ్గు ఉత్పత్తి సాధించి సంస్థలోనే చివరిస్థానంలో నిలిచింది. 60శాతం ఉత్పత్తితో మందమర్రి ఏరియా చివరినుంచి రెండో స్థానంలో ఉంది.
వేసవి కాలం అనుకూల ప్రభావం చూపేనా!
ఓసీపీలు ఉన్న ఆర్జీ–2, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల్లో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే అవకాశం కన్పిస్తుండగా, భూగర్భగనులు అధికంగా ఉన్న మిగితా ఏరియాల్లో లక్ష్యాలను సాధించడం కొంచెం కష్టంగానే ముందుకు సాగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వేసవికాలం ఓసీపీల్లో ఉత్పత్తికి అనుకూలంగా ఉండే అవకాశం కన్పిస్తుండటంతో ఎలాగైనా వార్షిక లక్ష్యాలను సాధించాలని పట్టుదలతో అధికారులు, ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు.
వందశాతం ఉత్పత్తి లక్ష్యాల్లో..
సింగరేణి వ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి ఆర్జీ–3 ఏరియా 115శాతం బొగ్గు ఉత్పత్తితో ముందంజలో నిలవగా, 105శాతం ఉత్పత్తితో రెండోస్థానంలో మణుగూరు, 103శాతం తో బెల్లంపల్లి మూడోస్థానంలో, వందశాతం ఉత్పత్తితో కొత్తగూడెం నాలుగోస్థానంలో నిలిచాయి. 97శాతంతో ఆర్జీ–1 ఐదోస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment