decreased.
-
మాజీ ఎంపీ పొంగులేటికి సెక్యూరిటీ తగ్గింపు
-
క్షీణతలోకి అమెరికా ఎకానమీ
వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ అయిన అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణించింది. బ్యూరో ఆఫ్ ఎకనమిక్ అనాలసిస్ (బీఈఏ) తుది సమీక్ష (మూడవ దఫా అంచనాల సవరణ) అనంతరం ఈ ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు క్రితం మైనస్ 1.5 శాతం గణాంకాలను ఎగువముఖంగా సవరించడం జరిగింది. వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో అమెరికా ఎకానమీ మాంద్యంలోకి జారిపోతుందన్న ఆందోళనలు నేపథ్యంలో తాజా ఫలితాలు వెలువడ్డం గమనార్హం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతను నమోదుచేస్తే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి జారినట్లు పరిగణిస్తారు. మార్చి నుంచి అమెరికా సెంట్రల్ బ్యాంక్ బెంచ్‌మార్క్ ఓవర్‌నైట్ వడ్డీరేటు 150 బేసిస్ పాయింట్లు పెంచిన (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) సంగతి తెలిసిందే. ఎకానమీ మైనస్‌లోకి జారుతున్నా, దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లుగా పేర్కొంటూ అధికారులు పరిస్థితిని పక్కదారిపట్టిస్తున్నారన్న విమర్శలూ నెలకొనడం గమనార్హం. మేలో రిటైల్ అమ్మకాలు పడిపోయాయి. గృహ నిర్మాణం, అనుమతులు తగ్గిపోయాయి. జూన్‌లో వినియోగ విశ్వాసం 16 నెలల కనిష్టానికి పడిపోయింది. వినియోగ ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్టానికి ఎగసింది. క్యూ1లో వాణిజ్యలోటు భారీగా పెరగడం (3.2 శాతం) ఎకానమీకి ప్రతికూలంగా మారింది. గత ఏడాది నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ 6.9 శాతం పటిష్ట వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే. -
దిగివస్తున్న బంగారం ధరలు
-
కిక్కు తగ్గింది..
కాజీపేట అర్బన్: అలిసిన మనసుకు సాంత్వన కలుగుతుందని కొందరు.. అలవాటుతో మరికొంద రు.. బానిసలై ఇంకొందరు సాయంత్రం అయిందంటే మద్యం తాగాల్సిందే! అయితే, డబ్బు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన కొన్ని బ్రాండ్ల మందు ఎంత తాగినా కిక్కు ఎక్కడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎలాగూ మద్యపాన ప్రియులు మందులో నీళ్లు కలుపుతారు కదా.. అదే పని మేమే చేస్తే పోలా.. అన్న భావనతో కొందరు వైన్స్, బార్ల యజమానులు ఇష్టారాజ్యంగా మందు కల్తీ చేసేస్తున్నారు. తద్వారా రూ.లక్షలు గడిస్తున్న ఈ మాఫియా, మందు బాబుల జేబులను గుళ్ల చేస్తోంది. నిలదీస్తేనే... పని ఒత్తిడిలో అలసిపోయి, శుభకార్యాల్లో ఆనందంగా గడిపేందుకు మద్యం ప్రియులు మద్యం షాపులకు వెళ్తుంటారు. సాధారణంగా క్వార్టర్ సీసా తాగితే కిక్కుతో ఊగిపోయే వారికి సైతం ఫుల్ బాటిల్ తాగినా కిక్కు ఎక్కడం లేదట! దీంతో మద్యం షాపు నిర్వాహకులను నిలదీయడంతో మద్యంలో కల్తీ జరిగిన విషయం బట్టబయలవుతోంది. ఫలితంగా మందు బాబులకు కిక్కు ఎక్కకున్నా.. మద్యం షాపుల్లోని గల్లాలు మాత్రం కళకళలాడుతున్నాయి. వేసిన సీల్ వేసినట్లే.. మద్యం బాటిళ్ల మూతకు వేసిన సీల్ వేసినట్టుగానే ఉంటుండగా.. మద్యం మాత్రం కల్తీ అవుతోంది. మద్యం బాటిళ్ల మూతలను ప్రత్యేక పరికారాలతో తీసేయడం.. నీళ్లు కలిపాక మళ్లీ మూత పెట్టడం నిష్ణాతులకే సాధ్యమవుతుంది. దీనికోసం కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించిన మద్యం మాఫియా ఎక్కువగా అమ్ముడయ్యే ఒరిజినల్ చాయిస్, రాయల్ స్టాగ్, బ్లెండర్ స్ప్రైడ్ వంటి బ్రాండ్ల మందు బాటిళ్లలో కల్తీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ నెలవారిగా బార్లు, వైన్స్ నుంచి అందే మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు తేలిపోతూ.. మద్యం షాపుల తనిఖీల మాటే ఎత్తడం లేదు. కల్తీ మద్యాన్ని అరికట్టడం, సమయపాలన పాటించేలా చూడాల్సి ఉన్నప్పటికీ ఆ వైపు దృష్టి సారించడం లేదు. ఇక బెల్ట్ షాపుల మాట ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట విషయానికొస్తే కొన్ని నెలలుగా సమయపాలన, కల్తీ విషయంలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. నగరాల్లో బ్రాండ్ మిక్సింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మద్యాన్ని నీటితో కల్తీ చేస్తుండగా కాజీపేట, హన్మకొండ, వరంగల్‌తో పాటు నగరాల్లో ఎక్కువ రేటు బ్రాండ్ మద్యంలో తక్కువ రేటు బ్రాండ్ మద్యాన్ని కలిపేస్తున్నారు. ఇటీవల హన్మకొండలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కిక్కు ఎక్కడం లేదంటూ మందు బాబులు ఏకంగా గొడవకు దిగిన విషయం విదితమే. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని.. జనగామలోని వైన్‌షాపులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా నీళ్లు కలిపిన 27 బాటిళ్లు లభ్యమయ్యాయి. ములుగు జంగాలపల్లిలో వైన్‌షాపులో ఏకంగా 500 కల్తీ చేసిన మద్యం బాటిళ్లు లభించడం గమనార్హం. ములుగులో మద్యం బాటిళ్ల మూతలు తీసి నీళ్లు కలిపే ముఠాను పట్టుకుని 20 బాటిల్లు, మూతలు, క్యాన్లలోని లూజ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన తనిఖీల్లో ఓ వైన్స్‌లో 19 కల్తీ చేసిన మద్యం బాటిళ్లు లభించాయి. -
సగటు జీవికి ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఇంధన ధరలు ఆదివారం వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 81.74 పలికింది. డీజిల్ ధర లీటర్‌కు 17 పైసలు పతనమై రూ 75.19గా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర స్వల్పంగా దిగివచ్చి రూ 86.90కి తగ్గింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 87.21గా నమోదైంది. డీజిల్ ధర లీటర్‌కు 18 పైసలు దిగివచ్చి రూ 78.82కు తగ్గింది. కాగా గతవారం అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ చమురు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నేపథ్యంలో ఇంధన ధరలు దిగిరావడం గమనార్హమని ఇంధన నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు మండుతున్న ఇంధన ధరలను నియంత్రించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఈనెల 4న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇంధన ధరలపై పన్ను భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు. -
6 ఏరియాలు.. వెనుకంజ
యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి జిల్లా) : నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరో 48 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ఇప్పటి వరకు 55.59మిలియన్ టన్ను ల ఉత్పత్తి లక్ష్యం కాగా 50.16 మిలియన్ టన్నులు(90శాతం) మాత్రమే సాధించింది. ఉత్పత్తిలో వెనుకబడిం ది. సింగరేణి వ్యాప్తంగా ఆరు ఏరియాలు వెనకంజలో ఉన్నాయి. భూగర్భ గనులు ఎక్కువగా ఉండటానికి తోడు, ఓసీపీల్లో ఓబీ వెలికితీతలో జాప్యం జరగడం.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యా ల సాధనపై ప్రభావం చూపుతోంది. సంస్థలో అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ కేవలం 18 శాతమే బొగ్గు ఉత్పత్తి సాధించి సంస్థలోనే చివరిస్థానంలో నిలిచింది. 60శాతం ఉత్పత్తితో మందమర్రి ఏరియా చివరినుంచి రెండో స్థానంలో ఉంది. వేసవి కాలం అనుకూల ప్రభావం చూపేనా! ఓసీపీలు ఉన్న ఆర్జీ–2, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల్లో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే అవకాశం కన్పిస్తుండగా, భూగర్భగనులు అధికంగా ఉన్న మిగితా ఏరియాల్లో లక్ష్యాలను సాధించడం కొంచెం కష్టంగానే ముందుకు సాగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వేసవికాలం ఓసీపీల్లో ఉత్పత్తికి అనుకూలంగా ఉండే అవకాశం కన్పిస్తుండటంతో ఎలాగైనా వార్షిక లక్ష్యాలను సాధించాలని పట్టుదలతో అధికారులు, ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు. వందశాతం ఉత్పత్తి లక్ష్యాల్లో.. సింగరేణి వ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి ఆర్జీ–3 ఏరియా 115శాతం బొగ్గు ఉత్పత్తితో ముందంజలో నిలవగా, 105శాతం ఉత్పత్తితో రెండోస్థానంలో మణుగూరు, 103శాతం తో బెల్లంపల్లి మూడోస్థానంలో, వందశాతం ఉత్పత్తితో కొత్తగూడెం నాలుగోస్థానంలో నిలిచాయి. 97శాతంతో ఆర్జీ–1 ఐదోస్థానంలో ఉంది. -
తగ్గిన ఐడియా లాభం..
♦ 12 శాతం పెరిగిన నికర అమ్మకాలు ♦ 3 రెట్లు పెరిగిన నికర రుణం న్యూఢిల్లీ: టెలికం సర్వీసులందించే ఐడియా సెల్యులర్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో స్వల్పంగా తగ్గింది. గత క్యూ3లో రూ.767 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.764 కోట్లకు పడిపోయిందని ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ వెల్లడించింది. నికర అమ్మకాలు రూ.8,017 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.9,010 కోట్లకు పెరిగాయని వివరించింది. మొబైల్ డేటా(2జీ, 3జీ, 4జీ) 76 శాతం, వాయిస్ మినిట్స్ 17 శాతం చొప్పున వృద్ధి సాధించాయని తెలిపింది. తాజా డిసెంబర్ క్వార్టర్లో 13 టెలికం సర్కిళ్లలో 3జీ సర్వీసులును, నాలుగు దక్షిణాది టెలికం సర్వీస్ ఏరియాల్లో 4జీ సర్వీసులను ప్రారంభించామని పేర్కొంది. 3జీ డేటాకు సంబంధించి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి(ఏఆర్పీయూ) ఆరోగ్యకరమైన స్థాయిలో రూ.196గా ఉందని వివరించింది. గత క్యూ3లో రూ.11,089 కోట్లుగా ఉన్న నికర రుణ భారం ఈ క్యూ3లో మూడు రెట్లు పెరిగి రూ.37,690 కోట్లకు చేరిందని ఐడియా సెల్యులర్ వివరించింది. గత ఏడాది కాలంలో 3జీ డేటా వినియోగదారుల సంఖ్య 82 లక్షల నుంచి 2.12 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి మొత్తం వినియోగదారుల సంఖ్య 18.2 కోట్లకు పెరిగిందని తెలిపింది. హైదరాబాద్‌లో ఐడియా 4జీ సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ కంపెనీ ఐడియా సెల్యులార్ భాగ్యనగరిలో 4జీ ఎల్టీఈ సేవలను ప్రారంభించింది. కంపెనీ గతేడాది డిసెంబరు 23 నుంచి 4జీ సర్వీసులను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో హైదరాబాద్ మినహా కరీంనగర్, నిజామాబాద్, కడప, విజయవాడ, వైజాగ్ తదితర పట్టణాల్లో ఈ సర్వీసులను ప్రారంభించింది. దేశంలో మొత్తం 10 సర్కిళ్లలో జూన్ నాటికి 750 నగరాల్లో 4జీ సేవలను విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం.