సాక్షి, సంగారెడ్డి : కందిలోని జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బందిపై మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలో భాగంగా శనివారం కంది వెళ్లిన మంత్రి అక్కడి పాఠశాల విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. పదో తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టులోని ప్రశ్నలు అడిగి.. వారి పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి ప్రశ్నలకు అక్కడి విద్యార్ధులు కనీసం సమాధానాలు చెప్పలేకపోయారు. తెలుగులో కూడా పేర్లు రాయలేకపోయారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులపై మంత్రి హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల చదువు ఇలా ఉంటే పరీక్షల్లో ఎలా పాసవుతారని హరీష్ ప్రశ్నించారు. పదో తరగతికి వచ్చినా కనీసం ఎక్కాలు చెప్పడం రాకపోతే ప్రపంచంతో ఎలా పోటీపడతారని మండిపడ్డారు. అనంతరం మధ్యాహ్న భోజనంపై ఆరాతీశారు. వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యకు ప్రభుత్వం అన్న రకాలుగా అండగా ఉంటుందని, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment