సాక్షి, కరీంనగర్: తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) కరీంనగర్‌లో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 24 గంటల తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ మానేరు తీరంలో మొక్కలు నాటారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద ఐటీ టవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లో నిత్యం తాగునీటిని అందించడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడ ప్రారంభించిన ప్రతి పని విజయవంతం అవుతుందని తెలిపారు. 2048 ఏడాది నాటికి సరిపడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గత ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ ఒక్కో రంగంపై దృష్టి పెట్టారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment