మంత్రుల పేషీల్లో పాత సిబ్బంది వద్దు | ministers do not want the old staff | Sakshi
Sakshi News home page

మంత్రుల పేషీల్లో పాత సిబ్బంది వద్దు

Published Thu, Jun 12 2014 5:45 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

మంత్రుల పేషీల్లో పాత సిబ్బంది వద్దు - Sakshi

మంత్రుల పేషీల్లో పాత సిబ్బంది వద్దు

- వారిని తక్షణమే మార్చి కొత్తవారిని నియమించుకోండి  
- మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
- వారికి పాత  మంత్రులతో ఇప్పటికీ సంబంధాలుంటాయని హెచ్చరిక
- కొత్త పేషీలో.. పాత సిబ్బందిపై  ‘సాక్షి’ కథనానికి స్పందన

సాక్షి, హైదరాబాద్: గతంలో మంత్రుల వద్ద పనిచేసిన అధికారులు, సిబ్బందిని కొత్త మంత్రులు తవు పేషీల్లో నియమించుకోవడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కొనసాగించడానికి వీల్లేదని, తక్షణమే మార్చి కొత్తవారిని నియమించుకోవాలని ఆయన  ఆదేశించారు. ‘కొత్త పేషీలో పాత సిబ్బంది’ శీర్షికన ‘సాక్షి’లో ఈనెల ఏడవ తేదీన వచ్చిన కథనంతోపాటు, పలువురు మంత్రుల కార్యాలయాల్లోని పీఎస్‌లు, పీఏలు, ఇతర సిబ్బంది నియామకానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని సీఎం స్పందించారు. గతంలో మంత్రుల వద్ద పనిచేసిన ఆంతరంగిక సిబ్బందికి.. వారితో ఇంకా సంబంధ బాంధవ్యాలు ఉంటాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ప్రస్తుతం మంత్రుల వద్ద అనధికారికంగా చేరిన వ్యక్తిగత, ఆంతరంగిక సిబ్బంది అంతా కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల వద్ద పనిచేసినవారే కావడం గమనార్హం. మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే.. ఈ వ్యక్తిగత, ఆంతరంగిక సిబ్బంది పేషీల్లో చేరిపోవడం, వారే మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో అన్నీ తామై వ్యవహరించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పాత సిబ్బంది తమకు అనుగుణంగా మంత్రులను సైతం మార్చేస్తారని ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం విధానాలు అమలు కావాలంటే.. కొత్తవారిని నియమించుకుంటేనే..  మన విధానాల అమలుకు అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

గతంలోని సిబ్బందిని నియమించుకుంటే.. వారే వసూళ్లు చేసి.. వాటాలు కూడా వారే పంచేస్తారని దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తనయుడు తారకరామారావు వద్ద చేరిన పీఎస్ వేణుగోపాల్ గతంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజన ర్సింహ వద్ద పనిచేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వద్ద చేరిన సత్యనారాయణరెడ్డి ఇదివరకు శిల్పామోహన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి దగ్గర పీఎస్‌గా పనిచేశారు.

హోం, గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి వద్ద పనిచేసిన గన్‌మెన్ సహా పేషీ మొత్తం ప్రస్తుతం నారుుని నర్సింహారెడ్డి పేషీగా వూరిపోరుంది. గీతారెడ్డి వద్ద పనిచేసిన ఉపేందర్, పీఏ బన్నయ్యలు ఇప్పుడు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వద్ద చేరారు. అలాగే మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి వద్ద పీఎస్‌గా ఉన్న మోహన్‌లాల్ అదే జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డివద్ద అదే హోదాలో చేరారు. దీనితో ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement