Ministers sworn in
-
ముంబై: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ
-
AP: కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు!
సాక్షి, అమరావతి: దాదాపు మూడేళ్ల తరవాత పునర్వ్యవస్థీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు రాబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్న కేబినెట్ నుంచి 10 మంది వరకూ... ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్ర కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉండగా... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే మెజారిటీ సంఖ్యలో 56 శాతంగా ఉన్నారు. అయితే తాజా పునర్వ్యవస్థీకరణలో బలహీనవర్గాల శాతం మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చంద్రబాబు నాయుడి కేబినెట్లో 25 మంది మంత్రులకు గాను మెజారిటీ.. అంటే 13 మంది అగ్రవర్ణాల వారుండగా, బలహీనవర్గాలు 12 మందే ఉండి 48 శాతానికే పరిమితమయ్యారు. దానికి భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరింత కీలక భాగస్వాములను చెయ్యాలనే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే 56 శాతం కేబినెట్ బెర్తులు వారికే కేటాయించారు. ఇపుడు ఆ సంఖ్యను మరింత పెంచబోతున్నారు. గవర్నరుకు రాజీనామాలు మంత్రివర్గంలో మొత్తం 25 మంది సభ్యులుండగా ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మరణించడం తెలిసిందే. మిగిలిన 24 మంది మంత్రులూ పార్టీ బాధ్యతలు తీసుకోవటానికి స్వచ్ఛందంగా రాజీనామా చేయటంతో... వారి రాజీనామాలను ఆమోదించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపారు. వీటిని గవర్నర్ ఆమోదించాక రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తుంది. అనంతరం కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్.. గవర్నర్‌కు పంపనున్నారు. మంత్రివర్గం కూర్పుపై సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తు ఆదివారం మధ్యాహ్నానికి కొలిక్కి వస్తుందని, ఆ వెంటనే కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపుతారని వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటిదాకా ఉన్నవారు 10 మంది కొనసాగుతారని, కొత్తగా 15 మంది చేరుతారని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. వారందరికీ ఆదివారం మధ్యాహ్నం గవర్నర్‌కు జాబితా పంపించిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమాచారమిస్తారని, సోమవారంనాడు అందుబాటులో ఉండాల్సిందిగా చెబుతారని తెలియవచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాక్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు. కాగా 2019 జూన్ 8న కూడా మంత్రులు ఇదే ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వివిధ శాఖలకు విధులను అప్పగిస్తూ జీఏడీ (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా సాధారణ పరిపాలన (ప్రోటోకాల్) విభాగం ఇప్పటికే సిద్ధం చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కొత్త, పాత మంత్రులు, అతిధులకు మధ్యాహ్నాం 1 గంటకు సచివాలయంలో తేనేటీ విందు (హైటీ) ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాస్ ఉంటేనే అనుమతి నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వారు ప్రభుత్వం జారీ చేసిన అధికారిక పాస్‌లను వెంట తెచ్చుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే సభా స్థలంలోకి అనుమతిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటలలోపు రావాలన్నారు. కేవలం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే లోటస్ జంక్షన్ నుంచి కరకట్ట మీదుగా ప్రయాణించేందుకు నిర్ధేశించారని తెలిపారు. గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అభిమానులు, వాహనదారులు ఎన్ఆర్ఐ ఆసుపత్రి జంక్షన్, మంగళగిరి, డాన్‌బాస్కో స్కూల్, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా సభా స్థలికి చేరుకోవాలన్నారు. విజయవాడ, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారు ఉండవల్లి సెంటర్, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా రావాలని చెప్పారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం దృష్ట్యా తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు అందరూ సహకరించాలని కోరుతూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
సరికొత్త ప్రయోగం: విజయ్ రూపానీ మంత్రివర్గంలోని వారికి నో ఛాన్స్
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని కూడా సిద్ధం చేశారు. గుజరాత్ కొత్త మంత్రులు గురువారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 24 మంది మంత్రులతో కూడిన కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వారందరితో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం జరిగింది. అయితే ఈసారి అంతా కొత్తవారే మంత్రులుగా నియమితులు కావడం విశేషం. గుజరాత్ మంత్రివర్గంతో సరికొత్త ప్రయోగం బీజేపీ చేపట్టింది. విజయ్ రూపానీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారెవరికీ కూడా కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. 2022 ఎన్నికలకు భూపేంద్ర పటేల్ ఈ టీమ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామాతో గుజరాత్లో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. చదవండి: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు కొత్త మంత్రులు వీరే.. గజేంద్ర సిన్హ్ పర్మార్, రాఘవ్జీ మక్వానా, వినోద్ మొరాడియా, దేవభాయ్ మాలం, హర్ష్ సంఘ్వీ, ముఖేశ్ పటేల్, నిమిష సుతార్, అర్వింద్ రాజ్యాని, కుబేర్ దిన్‌దాన్, కీర్తిసిన్హ్ వాఘేలా, జగ్జీశ్ పంచాల్, బ్రిజేశ్ మెర్జా, జితూ చౌదరి, మనీశ వకీల్, కానూ భాయ్ దేశాయ్, కీర్తిసిన్హ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్‌సిన్హ్ పర్మార్, అర్జున్ సిన్హ్ చౌహాన్, రాజేంద్ర త్రివేది, జితూ వాఘానీ, రిషికేశ్ పటేల్, రాఘవ్జీ పటేల్, పూర్ణేశ్ మోదీ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపి గుజరాత్ మార్క్ పాలనను కొనసాగించాలని ఆకాక్షించారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం -
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, ముంబై: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా శుక్రవారం కేబినెట్, సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారులో శనివారం శాఖలు కేటాయించారు. ఇందులో బీజేపీ విద్యుత్, ఇరిగేషన్, నీటి పారుదల లాంటి కీలక శాఖలను తమవద్ద ఉంచుకుని తమ మిత్రపక్షమైన శివసేనకు ప్రజా పనుల శాఖ మినహా మిగతావన్నీ ప్రాధాన్యత లేని శాఖలు అంటగట్టినట్లు స్పష్టమవుతోంది. బీజేపీ మంత్రులకు కేటాయించిన శాఖలు: గిరీష్ బాపట్- ఆహార, పౌర సరఫరాల శాఖ, విని యోగదారుల సంరక్షణ, శాసనసభ వ్యవహారాలు. గిరీష్ మహాజన్- జల వనరులు చంద్రశేఖర్ బావన్కులే- విద్యుత్ బబన్‌రావ్ లోణికార్- ఇరిగేషన్, పరిశుభ్రత రాజ్‌కుమార్ బడోలే- సామాజిక న్యాయ శాఖ, ప్రత్యేక సహాయ శాఖ సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలివే.. రామ్ షిండే- గృహ, మార్కెటింగ్, సార్వజనిక ఆరోగ్యం, పర్యాటకం విజయ్‌కుమార్ దేశ్‌ముఖ్- పీడబ్ల్యూడీ (ప్రాజెక్టులు), రవాణ, కార్మిక, వస్త్రోద్యోగం అంబరీష్ రాజే ఆత్రాం- గిరిజన సంక్షేమం రంజీత్ పాటిల్- న్యాయ శాఖ ప్రవీణ్ పోటే- ఉద్యోగ, పర్యావరణ, పీడబ్ల్యూడీ (ప్రాజెక్టులు మినహా) శివసేనకు చెందిన మంత్రులకు కేటాయించిన శాఖలు... దివాకర్ రావుతే- రవాణా శాఖ సుభాష్ దేశాయ్- పరిశ్రమలు రాందాస్ కదం- పర్యావరణం ఏక్నాథ్ షిండే- ప్రజా పనులు. (పీడబ్ల్యూడీ) దీపక్ సావంత్- సార్వజనిక ఆరోగ్య, కుటుంబ సంక్షేమం సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలు... సంజయ్ రాఠోడ్- రెవెన్యూ దాదాజీ భుసే- సహకారం విజయ్ శివ్‌తారే- జల వనరులు దీపక్ కేసర్కర్- ఆర్థిక, గ్రామాభివృద్ధి రవీంద్ర వాయ్‌కర్- గృహనిర్మాణ, ఉన్నత సాంకేతిక విద్య -
మంత్రుల పేషీల్లో పాత సిబ్బంది వద్దు
- వారిని తక్షణమే మార్చి కొత్తవారిని నియమించుకోండి - మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం - వారికి పాత మంత్రులతో ఇప్పటికీ సంబంధాలుంటాయని హెచ్చరిక - కొత్త పేషీలో.. పాత సిబ్బందిపై ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి, హైదరాబాద్: గతంలో మంత్రుల వద్ద పనిచేసిన అధికారులు, సిబ్బందిని కొత్త మంత్రులు తవు పేషీల్లో నియమించుకోవడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కొనసాగించడానికి వీల్లేదని, తక్షణమే మార్చి కొత్తవారిని నియమించుకోవాలని ఆయన ఆదేశించారు. ‘కొత్త పేషీలో పాత సిబ్బంది’ శీర్షికన ‘సాక్షి’లో ఈనెల ఏడవ తేదీన వచ్చిన కథనంతోపాటు, పలువురు మంత్రుల కార్యాలయాల్లోని పీఎస్‌లు, పీఏలు, ఇతర సిబ్బంది నియామకానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని సీఎం స్పందించారు. గతంలో మంత్రుల వద్ద పనిచేసిన ఆంతరంగిక సిబ్బందికి.. వారితో ఇంకా సంబంధ బాంధవ్యాలు ఉంటాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రుల వద్ద అనధికారికంగా చేరిన వ్యక్తిగత, ఆంతరంగిక సిబ్బంది అంతా కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల వద్ద పనిచేసినవారే కావడం గమనార్హం. మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే.. ఈ వ్యక్తిగత, ఆంతరంగిక సిబ్బంది పేషీల్లో చేరిపోవడం, వారే మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో అన్నీ తామై వ్యవహరించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పాత సిబ్బంది తమకు అనుగుణంగా మంత్రులను సైతం మార్చేస్తారని ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం విధానాలు అమలు కావాలంటే.. కొత్తవారిని నియమించుకుంటేనే.. మన విధానాల అమలుకు అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలోని సిబ్బందిని నియమించుకుంటే.. వారే వసూళ్లు చేసి.. వాటాలు కూడా వారే పంచేస్తారని దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తనయుడు తారకరామారావు వద్ద చేరిన పీఎస్ వేణుగోపాల్ గతంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజన ర్సింహ వద్ద పనిచేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వద్ద చేరిన సత్యనారాయణరెడ్డి ఇదివరకు శిల్పామోహన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి దగ్గర పీఎస్‌గా పనిచేశారు. హోం, గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి వద్ద పనిచేసిన గన్‌మెన్ సహా పేషీ మొత్తం ప్రస్తుతం నారుుని నర్సింహారెడ్డి పేషీగా వూరిపోరుంది. గీతారెడ్డి వద్ద పనిచేసిన ఉపేందర్, పీఏ బన్నయ్యలు ఇప్పుడు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వద్ద చేరారు. అలాగే మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి వద్ద పీఎస్‌గా ఉన్న మోహన్‌లాల్ అదే జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డివద్ద అదే హోదాలో చేరారు. దీనితో ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.