PS
-
బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్రరావుపై కేసు
-
విదేశాల నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు మాజీ పీఎస్
సాక్షి, విజయవాడ: స్కిల్ స్కామ్ విచారణ సమయంలో అమెరికా వెళ్లిపోయిన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ విదేశాల నుంచి తిరిగొచ్చారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు అనంతరం తిరిగి వచ్చిన శ్రీనివాస్.. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. గతంలో చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేసిన పెండ్యూల శ్రీనివాస్‌కు 2023 సెప్టెంబర్‌లో స్కిల్ స్కాం కేసులో సీఐడీ నోటీసులు జారీ చేసింది.మనీ లాండరింగ్‌పై ప్రశ్నించేందుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన కానీ.. తీసుకోకుండా పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు వెళ్లిపోయారు. గత ఏడాది సెప్టెంబరు 6న అమెరికాకు పరారయ్యారు. దీంతో శ్రీనివాస్‌ను సెప్టెంబరు 30న గత ప్రభుత్వం సస్పెండ్ర చేసింది. 2020 ఫిబ్రవరి 6న పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లోనూ, పలు కంపెనీల్లో ఐటి సోదాలు జరిగాయి. ఆ సోదాల్లో రూ.2000 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తించినట్టు ఐటీ శాఖ అధికారులు ప్రకటించారు. -
అమ్మాయిలతో ఫ్లర్టింగ్ ఎలా చేయాలో చెప్పిన కార్తీ
-
ఆ సీన్ మొత్తం ఒక్క షాట్ లోనే తీశాం..
-
ఐశ్వర్యారాయ్ గురించి అడగగానే విక్రమ్ రియాక్షన్
-
ఐశ్వర్యారాయ్ గురించి అడగగానే విక్రమ్ రియాక్షన్
-
పోలీస్ స్టేషన్ ఎదుట బీఫ్ కర్రీ పంపిణీ..
కోజికోడ్ : కేరళలో పోలీస్ ట్రైనీల మెనూలో బీఫ్‌ను తొలగించారన్న వార్తల నేపథ్యంలో కోజికోడ్‌లోని ఓ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బీఫ్ కర్రీ, బ్రెడ్‌ను పంచారు. ముక్కం పోలీస్ స్టేషన్ వద్ద కేపీసీసీ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ కే ప్రవీణ్ కుమార్ బీఫ్ కర్రీ, బ్రెడ్ పంపిణీని ప్రారంభించారు. ప్రధాని మోదీని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రమాణ స్వీకరాం చేసిన వెంటనే కలిశారని, ఆయన ప్రోద్బలంతో మోదీ, షాలకు క్లీన్ చిట్ ఇచ్చిన లోక్‌నాథ్ బెహెరాను డీజీపీగా నియమించారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సంఘ్ అజెండాను పినరయి విజయన్ తలకెత్తుకున్నారని, ఆయన రెండు నాల్కల ధోరణిని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుందని అన్నారు. మరోవైపు పోలీస్ ట్రైనీల మెనూ నుంచి బీఫ్‌ను తొలగిస్తారన్న ప్రచారం అవాస్తవమని కేరళ పోలీసు విభాగం స్పష్టం చేసింది. చదవండి : ‘పిల్లలు బీఫ్ తినడం పెద్దల తప్పు’ -
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యయత్నం
-
పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని..
సాక్షి, ప్రకాశం: పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని తన్నీరు నాగరాజుగా గుర్తించారు. ఓ కేసు విషయంలో ఏఎస్ఐ మురళీ కృష్ణ తనను వేధిస్తుండటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు నాగరాజు వెల్లడించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 14వ తేదిన నాగరాజుకు, అతని బాబాయికి మధ్య గొడవ జరిగింది. 16న పోలీసులు వీరిద్దరి మీద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగానే.. బాబాయి తనపై జాలమ్మ గుడి వద్ద హత్యాయత్నం చేసినట్లు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఏఎస్ఐ మురళీ కృష్ణ తన ఫిర్యాదును పట్టించుకోకుండా.. తననే వేధింపులకు గురి చేస్తున్నాడని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు కూడా డిమాండ్ చేయటంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించాడు. -
మంత్రిగారి పీఎస్సా మజాకా?
కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు అధికారుల పనితీరుపై ఆరా అధికారిక కార్యక్రమాల్లోనూ జోక్యం గగ్గోలు పెడుతున్న ప్రభుత్వాధికారులు గుర్ల: ఆయన మంత్రి కాదు... శాఖలకు ఉన్నతాధికారి అస్సలు కాదు.. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పెత్తనం చెలాయిస్తారు. అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. మంత్రి లేని సమయాల్లో నేరుగా కార్యాలయాల్లోకి వచ్చి తన ప్రతాపం చూపిస్తుంటారు. ఇదీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని పర్సనల్ సెక్రెటరీ(పీఎస్) రామకృష్ణ హంగామా. మంగళవారం గుర్ల మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. బొంగుహారన్ కలిగిన ప్రభుత్వ వాహనంపై నేరుగా గుర్ల ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ స్త్రీశక్తి భవనంలో జరుగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు పి.ఆదిలక్ష్మితో పలు విషయాలపై చర్చించారు. తొలుత జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి ఎంపీడీఓలు, ఏపీఓలకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు వద్ద కాసేపు కూర్చుని పరిశీలించారు. పీహెచ్సీలో పరిస్థితులపై ఆరా గుర్ల పీహెచ్‌సీలోకి ప్రవేశించి ఆస్పత్రిలో ల్యాబ్, మందులిచ్చే గది, సిబ్బంది గదులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ అభిజ్ఞను పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబెట్టారు. ఓపీ ఎంత వస్తోంది.? గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇంత వరకూ ఎన్ని మాతృ, శిశు మరణాలు సంభవించాయి. బాల్యవివాహాల నిరోధానికి ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎమ్ల సహాయంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారా..? మందులు సక్రమంగా అందుతున్నాయా...? రోగులకు సక్రమమైన సేవలు అందిస్తున్నారా అంటూ ఆరా తీశారు. గతంలోనూ ఇలా రెండుసార్లు గతంలో పీహెచ్‌సీకి వచ్చి తనిఖీ చేశారు. హాజరు పట్టీని తనిఖీ చేసి గ్రీన్‌పెన్‌తో స్వయానా రౌండప్ చేశారు. ఇలా మంత్రి పీఎస్ పదే పదే కార్యాలయాలను తనిఖీ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈయనే మంత్రిలా స్వయాన గెజిటెడ్ అధికారులను సైతం ప్రశ్నించడంపై అధికార వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పీఎస్ వస్తున్నారు అని తెలియగానే తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంటోందని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
చిట్టీల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
ట్రాఫిక్ పీఎస్ ఎదుట యువతి ఆందోళన
-
అయ్యన్న పేషీలో అవినీతి.. ఓఎస్డీ, పీఎస్ తొలగింపు
-
అయ్యన్న పేషీలో అవినీతి.. ఓఎస్డీ, పీఎస్ తొలగింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యన పాత్రుడి పేషీలో అవినీతి ఆరోపణలు వచ్చిన ఇద్దరు అధికారులను తొలగించారు. 45 కోట్ల రూపాయల పనుల కేటాయింపునకు సంబంధించి మంత్రి ఓఎస్డీ, పీఎస్ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం మంత్రి దృష్టికి రావడంతో వారిద్దరినీ విధుల నుంచి తప్పించారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి, పాడేరు రహాదారులకు సంబంధించి 45 కోట్ల రూపాయల విలువైన పనులను తమ వారికి ఇప్పించుకునేందుకు మంత్రి ఓఎస్డీ, పీఎస్ ప్రయత్నించారు. భారీ మొత్తంలో నిధులున్న పనులను నామినేషన్ల పద్ధతి ద్వారా కేటాయించాలని మంత్రికి ఫైలు పంపారు. ఈ విషయంపై మంత్రి ఆరా తీయగా, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెప్పారు. అధికారులు అవినీతికి పాల్పడినట్టు అయ్యన్న పాత్రుడి దృష్టికి రావడంతో వారిని తొలగించారు. గతంలో కూడా వీరిద్దరూ ఓ ఆర్డీఓ బదిలీ విషయంలో జోక్యం చేసుకున్నట్టు మంత్రి దృష్టికి వచ్చింది. ఆర్డీఓ నుంచి తీసుకున్న 30 లక్షల రూపాయల లంచాన్ని మంత్రి ఆదేశాల మేరకు అధికారులు వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. -
మంత్రుల పేషీల్లో పాత సిబ్బంది వద్దు
- వారిని తక్షణమే మార్చి కొత్తవారిని నియమించుకోండి - మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం - వారికి పాత మంత్రులతో ఇప్పటికీ సంబంధాలుంటాయని హెచ్చరిక - కొత్త పేషీలో.. పాత సిబ్బందిపై ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి, హైదరాబాద్: గతంలో మంత్రుల వద్ద పనిచేసిన అధికారులు, సిబ్బందిని కొత్త మంత్రులు తవు పేషీల్లో నియమించుకోవడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కొనసాగించడానికి వీల్లేదని, తక్షణమే మార్చి కొత్తవారిని నియమించుకోవాలని ఆయన ఆదేశించారు. ‘కొత్త పేషీలో పాత సిబ్బంది’ శీర్షికన ‘సాక్షి’లో ఈనెల ఏడవ తేదీన వచ్చిన కథనంతోపాటు, పలువురు మంత్రుల కార్యాలయాల్లోని పీఎస్‌లు, పీఏలు, ఇతర సిబ్బంది నియామకానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని సీఎం స్పందించారు. గతంలో మంత్రుల వద్ద పనిచేసిన ఆంతరంగిక సిబ్బందికి.. వారితో ఇంకా సంబంధ బాంధవ్యాలు ఉంటాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రుల వద్ద అనధికారికంగా చేరిన వ్యక్తిగత, ఆంతరంగిక సిబ్బంది అంతా కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల వద్ద పనిచేసినవారే కావడం గమనార్హం. మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే.. ఈ వ్యక్తిగత, ఆంతరంగిక సిబ్బంది పేషీల్లో చేరిపోవడం, వారే మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో అన్నీ తామై వ్యవహరించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పాత సిబ్బంది తమకు అనుగుణంగా మంత్రులను సైతం మార్చేస్తారని ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం విధానాలు అమలు కావాలంటే.. కొత్తవారిని నియమించుకుంటేనే.. మన విధానాల అమలుకు అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలోని సిబ్బందిని నియమించుకుంటే.. వారే వసూళ్లు చేసి.. వాటాలు కూడా వారే పంచేస్తారని దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తనయుడు తారకరామారావు వద్ద చేరిన పీఎస్ వేణుగోపాల్ గతంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజన ర్సింహ వద్ద పనిచేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వద్ద చేరిన సత్యనారాయణరెడ్డి ఇదివరకు శిల్పామోహన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి దగ్గర పీఎస్‌గా పనిచేశారు. హోం, గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి వద్ద పనిచేసిన గన్‌మెన్ సహా పేషీ మొత్తం ప్రస్తుతం నారుుని నర్సింహారెడ్డి పేషీగా వూరిపోరుంది. గీతారెడ్డి వద్ద పనిచేసిన ఉపేందర్, పీఏ బన్నయ్యలు ఇప్పుడు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వద్ద చేరారు. అలాగే మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి వద్ద పీఎస్‌గా ఉన్న మోహన్‌లాల్ అదే జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డివద్ద అదే హోదాలో చేరారు. దీనితో ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. -
వాళ్లను పీఏలుగా, పీఎస్లుగా పెట్టుకోవద్దు!
-
'ఆ పీఎస్, పీఏలను మంత్రులెవరూ పెట్టుకోవద్దు'
హైదరాబాద్ : గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన పీఎస్ (పర్సనల్ సెక్రటరీ), పీఏ(పర్సనల్ అసిస్టెంట్)లను ప్రస్తుత మంత్రులెవరూ నియమించుకోరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఒకవేళ వారిని నియమించుకుంటే వెంటనే తొలగించాలని కేసీఆర్ బుధవారం మంత్రలకు ఆదేశాలు ఇచ్చారు. కొత్తవారిని నియమించుకోవాలని కేసీఆర్ ఈనేపథ్యంలో మంత్రులకు స్పష్టం చేశారు. దాంతో మంత్రులు తమ పేషీల్లో కొత్తవారిని,పాలనాపరంగా అనుభవం ఉన్నవారినే నియామించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.