జాపర్‌పల్లిలో వాటర్ గ్రిడ్ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్
పరిగి: మే 15న ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందిస్తామని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. పరిగి మండలం జాపర్‌పల్లి శివారులో మిషన్ భగీరథ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటుతో పాటు నిర్మాణంలో పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న చోట కొందరు రైతులు తమ పొలాలు ఉన్నాయని కాంట్రాక్టర్‌కు అడ్డుతగలడంతో ఆ ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. భూములు ప్రైవేటువైనా, ప్రభుత్వానివైనా పనులకు అడ్డు తగులొద్దని సూచించారు. పనులు సజావుగా జరిగేలా చూడాలని తహసీల్దార్ అబీద్‌అలీని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయన ఇంజనీర్లతో మాట్లాడారు. పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని తెలిపారు. ఏప్రిల్ మాసంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు.
అనంతరం మే 15వ తేదీన ఇంటింటికి తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మిషన్ భగీరథలో భాగంగా జిల్లాలోని పరిగి, తాండూరు, కొడంగల్, వికారాబాద్ నియోజకవర్గాల్లోని 1050 గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందజేస్తామని వివరించారు. ఇందుకోసం అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. పరిగి మండలం జాపర్‌పల్లి శివారులో 135 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ ఫర్ డే) సామర్థ్యంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంటులో శుద్ధిచేసి ఇంటింటికి తాగు నీరందిస్తామని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అబీద్‌అలీ, ఎంపీడీఓ విజయప్ప, ఇంజనీర్లు పద్మలత, నరేందర్, బాబు, శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ లాల్‌కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment