తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో అవినీతికి స్థానం లేదని నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో అవినీతికి స్థానం లేదని నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయ విజయవంతం అయిందని అన్నారు. ఇప్పటివరకూ 60వేల చెరువుల్లో పనులు ప్రారంభించామని హరీష్ తెలిపారు.
గ్రామాలను సస్యశ్యామలం చేయడానికే ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులు చేపట్టిందని, పనులు పారదర్శకత కోసం ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా పనులు కేటాయించామని చెప్పారు. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.