‘మిషన్ కాకతీయ’ అస్తవ్యస్తం | Mission Kakatiya works is failure | Sakshi
Sakshi News home page

‘మిషన్ కాకతీయ’ అస్తవ్యస్తం

Published Wed, Apr 20 2016 3:09 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

‘మిషన్ కాకతీయ’ అస్తవ్యస్తం - Sakshi

‘మిషన్ కాకతీయ’ అస్తవ్యస్తం

ఇంటివద్ద కూర్చునే అధికారుల ఎస్టిమేట్
పురాతన తూముల కూల్చివేత
రైతులను సంప్రదించకుండా   ప్రతిపాదనలు

 
 
 జగిత్యాల రూరల్
: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌కాకతీయ పథకం అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అస్తవ్యస్తంగా మారుతోంది. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ, బిల్లులు పొందుతున్నారు. జగిత్యాల మండలంలో మొదటివిడత మంజూరైన పనుల్లోనే నాణ్యత లోపించడంతో వర్షాకాలంలో మత్తళ్లు, చెరువు కట్టలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

 మండలంలోని సోమన్‌పల్లి ఊరచెరువుకు మొదటి విడతలో మిషన్‌కాకతీయ కింద రూ.26.63 లక్షలు మంజూరయ్యూరుు. ఈ నిధులతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా రైతులకు ఎలాంటి ఉపయోగమూ లేని మత్తడితోపాటు రేలింగ్‌వాల్ నిర్మించారు. చెరువు ఆయకట్టు కింద రైతులకు ఎక్కడ సాగునీరు అవసరమో..? ఎక్కడ విస్తీర్ణం ఎక్కువగా ఉందో..? అధికారులు చూడకుండానే రేలింగ్‌వాల్స్ నిర్మించారు. దీనికితోడు నిజాంకాలం నాటి పురాతన తూములను కాంట్రాక్టర్ డిటోనేటర్లతో పేల్చి ధ్వంసం చేరుుంచారు. వాటిస్థానంలో సిమెంట్, కంకరతో తూములను నిర్మించినా అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తూములకు కింది భాగంలో బెడ్ వేసి నిర్మించాల్సి ఉన్నా.. పాత రాళ్లపైనే తూతూమంత్రంగా నిర్మించారు. తూములు రేలింగ్‌వాల్స్‌కు ఎత్తుగా ఉండాల్సి ఉండగా.. కిందికి అయింది, రేలింగ్‌వాల్ పైకి వచ్చింది.

దీంతో చెరువులో నుంచి తూము ద్వారా నీరు వచ్చిన సాగుకు అందడం గగనంకానుంది. పురాతన కట్టను కాంట్రాక్టర్ జేసీబీతో తవ్వి.. చెరువులోని మట్టినిపోసి, పాత రేలింగ్‌ను తొలగించి మళ్లీ అదే రాయిని కట్టకు పరిచేందుకు సిద్ధమవుతున్నారు. గత వేసవిలో రైతులు చెరువు నుంచి దాదాపు 10 వేల ట్రిప్పుల మట్టిని స్వచ్ఛందంగా పోసుకున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ అదే మట్టిని తాను రైతులకు సర ఫరా చేసినట్లు గుంతలను చూపించుకుని ఎంబీ రికార్డు చేయించుకుంటున్నారు. మత్తడి నిర్మాణంలో పాత మత్తడికే సిమెంట్ పూతలు పెట్టి కొత్తగా నిర్మించినట్లు రికార్డులు చేయించుకుంటున్నారు.


 పోరండ్ల గ్రామంలో
 పోరండ్ల ఊర చెరువుకు మిషన్ కాకతీయలో మొదటి విడత రూ.25.75 లక్షలు మంజూరయ్యూరుు. కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మక్కై సాగులేని చోటకు సిమెంట్ రేలింగ్‌వాల్ నిర్మించారు. చెరువులో పూడికమట్టిని లోతు తీయాల్సి ఉన్నా.. నామమాత్రంగా మట్టిని తీసి ఎంబీ రికార్డు చేయించుకున్నారు. అలాగే రైతులు స్వచ్ఛందంగా తీసుకున్న మట్టిని సైతం కాంట్రాక్ట్‌లో భాగంగా తీసినట్లు బిల్లు రారుుంచుకున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఈ చెరువును కొద్దిగానైనా మరమ్మతు చేయలేదంటే అతిశయోక్తికాదు.
 
 
 పురాతన తూములు ధ్వంసం చేశారు

 మిషన్ కాకతీయలో ఊర చెరువు అభివృద్ధి కోసం నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు అవసరమైన పనులు చేయకుండా ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. పాత మత్తడిని కొత్తగా నిర్మించినట్లు చూపిస్తున్నారు. ఎస్టిమేట్‌లో లేని పనులు చేసి బిల్లులు తీసుకుంటున్నారు. - గొంటి మొగిలి, రైతు, సోమన్‌పల్లి


 రూపాయి  పనిచేయలే..
ఊర చెరువు అభివృద్ధికి రూ.25.75లక్షలు మంజూరైన మాటేగానీ.. ఇప్పటివరకు రూపారుు పనిచేయలేదు. చెరువు పైభాగంలో మట్టి తీరుుంచారు. సాగులేని ప్రాంతంవద్ద సిమెంట్ రేలింగ్‌వాల్ నిర్మించారు. రైతులు స్వచ్ఛందంగా తీరుుంచుకున్న మట్టిని తాను తీరుుంచినట్లు కాంట్రాక్టర్ బిల్లు తీసుకున్నాడు. - బొడుగం బాపురెడ్డి, రైతు, పోరండ్ల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement