‘మిషన్’పై పర్యవేక్షణేది?
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
రూ.5.53 కోట్లతో 14 చెరువులు, కుంటల మరమ్మతులు కొనసాగుతున్న పనులు
రెండోదశ పనులు త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ
జఫర్‌గఢ్: ఎన్నో ఏళ్ల నుంచి నిరాధరణకు గురైన చెరువులు, కుంటలను మరమ్మతు చేసి వాటికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆయా గ్రామాల్లో రెండో విడతలో చేపట్టిన చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. 14 చెరువులు, కుంటల మరమ్మతులకు గాను ప్రభుత్వం రూ.5.53 కోట్ల నిధులను మంజూరు చే సింది. వీటికి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య శంకుస్థాపన చేయగా సంబంధిత కాంట్రాక్టర్లు పనులను ప్రారంభించారు. మండలంలో మొత్తం 13 చెరువులు ఉండగా చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 88 కుంటలు ఉన్నాయి. వీటి పరిధిలో 950 హెక్టార్లపై పైగా పంట సాగు కావాల్సి ఉంది. కొన్నేళ్ల నుంచి చెరువులు, కుంటలు ఎలాంటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో పాటు పూర్తిగా నిరాధరణకు గురయ్యూయి. వీటితో పాటు ఆయా చెరువులకు నీరందించే వరదకాల్వలు కూడా ఎలాంటి మరమ్మతుకు నోచుకోలేదు. దీంతో ప్రతి వర్షాకాలంలో కురిసిన కొద్ది పాటి నీరు కూడా చెరువులు, కుంటలలోకి రాక వృథాగా పోతున్నారుు. మొదటి దశలో ఒక్క తమ్మడపల్లి (ఐ) చెరువు మినహా అన్ని చెరువుల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఇటీవల రెండోదశలో చేపట్టిన చెరువుల మరమ్మతు పనులు సాగరం, కోనాయిచలం, వెంకటాపూర్ గ్రామాలు మినహా మిగతా 11 గ్రామాల చెరువుల పనులు ప్రారంభమయ్యూయి.
పనులపై తనిఖీలు శ్యూం
మిషన్ కాకతీయ పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. పనులు జరుగుతున్న సమయంలో అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనిఖీలు చేయాల్సిన అధికారులు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. కాంట్రాక్టర్లే ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. పనులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నీరుగారిపోయో ప్రమాదం ఉందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
పనులను పర్యవేక్షిస్తున్నాం
మండలంలో మిషన్ కాకతీయ ద్వారా 14 చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు తమ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అగ్రిమెంట్ ప్రకారం 90 రోజుల్లోగా పూర్తి చేయాలి. - హరి, ఐబీ డీఈ