చెరువుల్లో 365 రోజులు
నీరుండేలా చూడాలి..
రైతు ఆత్మహత్యల నివారణకు
దీర్ఘకాలిక పరిష్కారాలు
రచరుుతల బృందం సభ్యుల వెల్లడి
జనగామ : ‘‘రైతన్నా.. మిషన్ కాకతీయ పనులు ఎలా ఉన్నాయి? చెరువులకు నీళ్లు వస్తున్నాయా? రాగడి మట్టిని పొలంలో వేసుకుంటే లాభం కనిపించిందా? అంటూ రచయిత బృందం సభ్యులు రైతులను తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మి షన్ పనులను పర్యవేక్షించేందుకు వికాస సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శనివారం జనగామ మండలంలోని పెంబర్తి గ్రామానికి చేరుకుం ది. సీఎం కార్యాలయ విద్యాశాఖ ఓఎస్‌డీ, వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, నీటి పా రుదల శాఖ ఓఎస్‌డీ శ్రీధర్‌రావ్ దేవ్‌పాండే, టీజీ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షుడు నందిని సిద్ధారె డ్డి, హైదరాబాద్ టీజేఏసీ చైర్మన్ ఆయాచితం శ్రీ దర్, జేఎన్‌టీయూహెచ్ ప్రొఫెసర్ వినయ్‌బాబు, రచరుుతల బందం సభ్యులు పెంబర్తి పెద చెరువు, పసరమడ్ల ఊర చెరువు, పెదరామన్ చర్ల చిన చెరువులను సందర్శించి, మిషన్ పనులపై ఆరా తీశారు.
గత పాలనలో చిన్ననీటి వనరులు చిన్నబోయూరుు..
ఈ సందర్భంగా శ్రీధర్‌రావ్ దేశ్‌పాండే, దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు. గతప్రభుత్వాల పాలనలో చిన్ననీటి వనరులు పనిచేయకుండా పోయాయన్నా రు. మొదటి దశలో కట్టల మరమ్మతు, అలుగుల నిర్మాణం చేయడం జరిగిందని, రెండో దశలో కట్టకు రాతి కట్టడాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని చెప్పారు. గత పాలకుల వైఫల్యంతోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యల నివారణకు దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని, ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచన చేస్తుందని వివరించారు. చెరువులు, కుంటల్లో 365 రోజులపాటు నీరు ఉండేలా చేస్తే ఒక్క ఆత్మహత్య కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రచయిత అనుభవాలను పుస్తకాల ద్వారా ప్రచారం
రచయితల ఆధ్వర్యంలో తలపెట్టిన మొదటి సందర్శన బస్సు యాత్రలో కవుల అనుభవాలను కవితల రూపంలో రాసేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్‌రా వ్ దేవ్ పాండే అన్నారు. 40 మంది కవులు, రచయితలతో కలిసి ఈ యాత్ర కొనసాగుతుందని, వరంగల్ నుంచి నేరుగా ఖమ్మం జిల్లాకు చేరుకుంటామన్నారు. చెరువు పనులు, వాటి తీరు తెన్నులపై రైతు లు, ప్రజలు సంతృప్తులు..అసంతృప్తులు వ్యక్త పరిచారన్నారు. చెరువుమట్టిని పొలాల్లో వేసుకోవడం వల్ల కలిగే లాభాలు, దిగుబడుల సామర్థ్యం ఎలా ఉంది? ఫెస్టిసైడ్, ఎరువుల మందుల ఖర్చు ఏ మేరకు తగ్గిం ది? అనే విషయాలు అడిగి తెలుసుకున్నామన్నారు. రైతులు చెప్పిన ప్రతి విషయూలు.. నివేదిక రూపంలో తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. గ్రామ సర్పంచ్ బాల్దె సిద్ధులు రచయిత బృందం సభ్యులకు స్వాగతం పలికారు. రచయిత లు, కవులు, వికాస సమితి ప్రతినిధులు మహేశ్వరం శంకర్, ఎర్రోజు శ్రీనివాస్, కవ్వ లక్ష్మారెడ్డి, వి. మురళి, ప్రసాద్, మోహన్‌రెడ్డి, దేవేందర్, నరేందర్, ఎంపీటీసీ కావ్యశ్రీ, రాజాసంపత్‌గౌడ్ ఉన్నారు.
రైతుల క్షేమం కోసమే..
మరిపెడ : రైతుల క్షేమం కోసమే మిషన్ కాకతీయ పనులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని మి షన్ కాకతీయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ దేశపతి శ్రీని వాస్ అన్నారు. మండలంలోని ఎల్లంపేట గ్రామం పెద్దచెరువు మిషన్ కాకతీయ పనులను పరిశీలించా రు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, ఎంపీపీ తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్, మండల కో-ఆప్షన్ సభ్యడు అయూబ్‌పాష, సిద్ధార్థరెడ్డి, శ్రీ దర్, దేవేందర్, శివకుమార్ పాల్గొన్నారు.
నేడు మెడికల్ రిప్స్ రాష్ట్రస్థాయి సమావేశం
హన్మకొండ కల్చరల్ : తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటెటీవ్స్ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు హన్మకొండ అలంకార్ జంక్షన్‌లోని టీఎన్‌జీఓ భవన్‌లో జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు.
‘మిషన్’తో ఆత్మహత్యల నివారణ
Published Sun, Sep 13 2015 4:17 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement