పోలీసుల తీరుపై ట్రైకార్ చైర్మన్ ఆగ్రహం
Published Mon, Jun 26 2017 3:38 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రామచంద్రపురంలో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో పోలీసుల తీరుపై ట్రైకార్ చైర్మన్, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు, గిరిజనేతరల మధ్య ఆదివారం ఘర్షణ, దాడి జరగగా గాయపడి పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనులను ఆయన పరామర్శించారు.
పది రోజుల క్రితమే ఘర్షణకు కారకులను అరెస్టు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయన అధికారుల తీరును తప్పుబట్టారు. అధికారులు వచ్చే దాకా ప్రభుత్వాసుపత్రి నుండి వెళ్ళనని నిరసన తెలుపుతూ అక్కడే ఉండిపోయారు.
Advertisement
Advertisement