
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వడం కాంగ్రెస్ పుణ్యమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క విద్యుత్ ప్లాంటు అయినా పూర్తిచేశారా? అని ప్రశ్నించారు. ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదన్నారు. జైపూర్ (మంచిర్యాల)లో 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేసిందన్నారు. దీనిని టీఆర్‌ఎస్ సర్కార్ ఏర్పాటు చేసినట్టుగా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి, ముందుచూపు వల్లనే ఇప్పుడు మిగులు విద్యుత్ సాధ్యపడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment