
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక రాయలసీమ ప్రాంతాల్లో శుక్రవారం ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి. కోమోరిన్ ప్రాంతం నుంచి లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరో వైపు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ప్రభావాల కారణంగా శనివారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుం చి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment