కేసీఆర్, మోదీ చీకటి  ఒప్పందం: ఉత్తమ్‌ | Modi And KCRs did not do anything for the people during the five years | Sakshi
Sakshi News home page

కేసీఆర్, మోదీ చీకటి  ఒప్పందం: ఉత్తమ్‌

Published Sun, Mar 31 2019 2:57 AM | Last Updated on Sun, Mar 31 2019 2:57 AM

Modi And KCRs did not do anything for the people during the five years - Sakshi

మఠంపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌లు నిత్యం పగటిపూట విమర్శలు చేసుకుంటూ, రాత్రి చీకటి ఒప్పందాలతో ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రచార సమావేశాలలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు బీజేపీకి వేసినట్లు అవుతుందన్నారు. మోదీ పాలనలో మైనార్టీలు, దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐదేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్‌లు ప్రజలకు చేసిందేమీలేదన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలతో అధికారంలోకి వచ్చి రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. రానున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పేద కుటుంబానికి నెలకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.72 వేలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement