
మహ్మద్‌నగర్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్
సాక్షి, కౌడిపల్లి(నర్సాపూర్): ఏ తప్పూ చేయనప్పటికీ అకారణంగా సస్పెండ్ చేశారని మండలంలోని మహ్మద్‌నగర్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ వాపోయారు. ఈనెల 1న కలెక్టర్ గ్రామంలో పర్యటించి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కౌడిపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్ చేసిన తప్పలకు తనను బలిచేశారని ఆరోపించారు. గత ఏప్రిల్ నుంచి డిప్యూటేషన్‌పై పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. సర్పంచ్ గతంలో చేసిన పనులకు సంబంధించి డబ్బులు డ్రా చేసుకోవడం జరిగిందన్నారు. అధికారులు మరోసారి ఆలోచించి సస్పెన్షన్ తొలగించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment