Panchayat secretary suspended
-
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్‌కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్‌రెడ్డి అందజేసిన అఫిడవిట్‌ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్‌పై రేపు విచారణ నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. -
ఏ తప్పూ లేకున్నా సస్పెండ్ చేశారు
సాక్షి, కౌడిపల్లి(నర్సాపూర్): ఏ తప్పూ చేయనప్పటికీ అకారణంగా సస్పెండ్ చేశారని మండలంలోని మహ్మద్‌నగర్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ వాపోయారు. ఈనెల 1న కలెక్టర్ గ్రామంలో పర్యటించి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కౌడిపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్ చేసిన తప్పలకు తనను బలిచేశారని ఆరోపించారు. గత ఏప్రిల్ నుంచి డిప్యూటేషన్‌పై పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. సర్పంచ్ గతంలో చేసిన పనులకు సంబంధించి డబ్బులు డ్రా చేసుకోవడం జరిగిందన్నారు. అధికారులు మరోసారి ఆలోచించి సస్పెన్షన్ తొలగించాలని కోరారు. -
పంచాయతీ కార్యదర్శిపై వేటు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మెదక్ మండలం అవుసులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌ను కలెక్టర్ స్మితాసబర్వాల్ సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఈ నెల 19న అవుసులపల్లిని సందర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నర్సాపూర్ మండలం నత్నాయపల్లి కార్యదర్శి శ్రీనివాస్‌ను కూడా కలెక్టర్ నవంబర్‌లో సస్పెండ్ చేసిన విషయం విదితమే. కాగా పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన 230 సర్పంచ్‌లకు కూడా తాజాగా నోటీసులు జారీ చేశారు. 13వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ తదితర పద్దుల కింద పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను కొందరు సర్పంచ్‌లు ఒకే పర్యాయం డ్రా చేశారు. వీటికి సంబంధించిన సరైన లెక్కలు చూపని పక్షంలో చర్యలు తీసుకుంటామంటూ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం సదరు సర్పంచ్‌లకు నోటీసులు జారీ చేసింది.