సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మెదక్ మండలం అవుసులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌ను కలెక్టర్ స్మితాసబర్వాల్ సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఈ నెల 19న అవుసులపల్లిని సందర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నర్సాపూర్ మండలం నత్నాయపల్లి కార్యదర్శి శ్రీనివాస్‌ను కూడా కలెక్టర్ నవంబర్‌లో సస్పెండ్ చేసిన విషయం విదితమే.
కాగా పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన 230 సర్పంచ్‌లకు కూడా తాజాగా నోటీసులు జారీ చేశారు. 13వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ తదితర పద్దుల కింద పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను కొందరు సర్పంచ్‌లు ఒకే పర్యాయం డ్రా చేశారు. వీటికి సంబంధించిన సరైన లెక్కలు చూపని పక్షంలో చర్యలు తీసుకుంటామంటూ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం సదరు సర్పంచ్‌లకు నోటీసులు జారీ చేసింది.
పంచాయతీ కార్యదర్శిపై వేటు
Published Sat, Dec 28 2013 2:53 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement