
మెదక్ రూరల్: కరెంట్ షాక్‌కు గురైన కొడుకును రక్షించబోయి ఓ తల్లి మృతి చెందింది. ఈ ఘటన మెదక్ మండలం రాయిన్‌పల్లి పంచాయతీ పరిధిలోని మల్కాపూర్ తండాలో గురువారం జరిగింది. బుధవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా తండాకు చెందిన శేఖర్, బూలీ దంపతుల గుడిసెకు విద్యుత్ షాక్ వచ్చింది.
దీంతో వారి కొడుకు శేఖర్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కొడుకును గుడిసె నుంచి బయటకు విసిరేసిన తల్లి.. షాక్‌తో అక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు బూలీని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. శేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment