మరణంలోనూ అమ్మతోనే.. | Mother, son killed in road accident | Sakshi
Sakshi News home page

మరణంలోనూ అమ్మతోనే..

Published Tue, Apr 19 2016 2:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM

Mother, son killed in road accident

రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు మృతి
మృతుడు దంత వైద్యుడు

 

జనగామ/కొడకండ్ల : రోడ్డు ప్రమాదం ఆ కు టుంబంలో పెను విషాదాన్ని నింపింది. మృ త్యువు రూపంలో వచ్చిన కారు తల్లీకుమారుడిని బలిగొంది. పది నిమిషాల్లో జనగామకు చేరుకునేలోపే అనంతలో కాలకు వెళ్లిపోయారు. నల్లగొండ జిల్లా ఆలేరు శివారులో జరిగిన ఈ ఘట నతో జనగామ, కొడకండ్లలో విషాద ఛాయలు అలుముకున్నారుు. కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ముసురం భారతమ్మ, పురుషోత్తం దంపతులకు కుమారులు సదానందం, సతీష్, దేవానంద్(28), కుమార్తె స్వప్న ఉన్నారు. చిన్నకుమారుడు డాక్టర్ దేవానంద్ బీడీఎస్ పూర్తి చేసి గత ఏడాదిగా జనగామలో మాతాశ్రీ దంత వైద్యశాల ఏర్పాటుచేసుకుని ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్నాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కుమార్తె స్వప్నకు పెళ్లి సంబం ధం చూసేందుకని తల్లీకుమారుడు భారతమ్మ, దేవానంద్ శనివారం హైదరాబాద్ వెళ్లారు. పెళ్లి పనులు ముగించుకొని  సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగుపయనమయ్యూరు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఆలేరు శివారులో ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యూ యి. వెంటనే వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా భారతమ్మ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దేవానంద్‌కు చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు. 

 
కొడకండ్ల, జనగామలో విషాద ఛాయలు

కాగా మృతురాలు భారతమ్మ కొడకండ్ల తన ఇంట్లో చేనేత వస్త్రాలను తయారు చేసుకొని పట్టణాల్లో జరిగే ఎగ్జిబిషన్లకు తరుచూ వెళ్లి విక్రయించుకొంటూ నిరంతరం శ్రమించేది. దేవానంద్ బీడీఎస్ పూర్తయ్యాక జనగామలోని ప్రైవేట్ క్లినిక్‌లో దంత వైద్యుడిగా సేవలందిస్తూ నే తన స్వగ్రామంలో ఓ క్లినిక్ ఏర్పాటు చేసేం దుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో తల్లికొడుకు మరణంతో వారి కుటుం బంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నా రుు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని  కన్నీరుమున్నీరుగా విలపించారు.

 
నేడు దంత వైద్యశాలలు బంద్

దంతవైద్యుడు దేవానంద్, తల్లి భారతమ్మ మృ తికి సంతాప సూచకంగా మంగళవారం వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు సిద్ధార్థరెడ్డి, రవికుమార్, శ్రీధర్, రఘు, సత్యం తెలిపారు. దేవానంద్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement