సాగునీటి ప్రాజెక్టులపై విషం కక్కుతున్నారు | mp balka suman fired on oppsition party | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులపై విషం కక్కుతున్నారు

Published Sun, Feb 5 2017 3:05 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

సాగునీటి ప్రాజెక్టులపై విషం కక్కుతున్నారు

సాగునీటి ప్రాజెక్టులపై విషం కక్కుతున్నారు

విపక్షాలపై ఎంపీ బాల్క ధ్వజం  
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టు లపై విపక్షాలు విషం కక్కుతున్నాయని టీఆర్‌ఎస్‌ నాయకుడు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ మండిపడ్డారు. ప్రాజెక్టులు ముందుకు కదలకుండా ప్రతిపక్షాలు, కొందరు తెలంగాణ ద్రోహులు సాగిస్తున్న కుట్రలో కాంగ్రెస్‌ పెద్దన్న పాత్ర పోషిస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల మీద అడ్డగోలుగా న్యాయ స్థానాల్లో పిటిషన్లు వేస్తున్నది ప్రతిపక్ష నాయకులు కాదా అని ప్రశ్నించారు.

భక్త రామదాసు ప్రాజెక్టు తమ హయాంలోనే మొదలై తక్కువ వ్యవధిలో పూర్తయ్యిందని, తమ చిత్తశుద్ధిని నిరూపించడానికి ఇదొక్కటి చాలని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఆరిపోయిన దీపమని, మళ్లీ వెలిగే ప్రసక్తే లేదన్నారు. నీచమైన విద్యలు రేవంత్‌కు, చంద్రబాబుకే ఎక్కువ తెలుసన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement