పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం
నిజామాబాద్ క్రైం : తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కోసం పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ని జిల్లా కోర్టు ముందు తెలంగాణకు ప్రత్యేక హై కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రత్యేక హై కోర్టు కోసం న్యాయవాదులు చేస్తున్న ఉద్య మం సబబేనన్నారు.న్యాయవాదులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచారన్నారు. తెలంగాణ వచ్చాక కూడ ఇలాంటి ధర్నాలు, దీక్షలు, నిరసనలు చూసేది లేకుండేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పడ్డాక పార్లమెంట్‌లో మొట్ట మొదటి సారిగా తాను పోలవరం నుంచి హైకోర్టు వరకు అనేక అంశాల పై మాట్లాడినట్లు తెలిపారు. ఇదే ఏ జెం డాపై సీఎం చంద్రశేఖర్‌రావు మూడుసార్లు ప్రధానమంత్రిలో మాట్లాడారన్నా రు. ఉద్యోగుల విభజన, క్యాడర్ అధికారుల విభజన, హై కోర్టు విభజన చాల ఆలస్యంగా జరుగుతున్నాయని, ఇప్పటికిప్పడు క్యాడర్ విభజన ప్రక్రియ మొదలయ్యిందన్నారు. హై కోర్టు విభజనపై ఇంకా ఊసేత్తటం లేదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు, ఏం జరుగుతు ందో మనందరికి తెలిసిన విషయమేనన్నారు. జరుగుతున్న ఈ మొత్తం వ్యవహరం వెనుక సీమాంధ్ర లాబీ ఉందని, వారికి హై కోర్టు విడిపోవద్దన్న కోరిక బలంగా ఉందన్నారు.
ఓ పక్క ప్రత్యేక హై కోర్టు కోసం న్యాయవాదులు ఉద్యమాలు చేస్తుంటే మరో పక్క కొత్తగా జడ్డీల నియమాకాలు చేపట్టడం ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మనకు కొత్త కష్టం వచ్చి పడిందన్నారు. న్యాయవాదులు కోరుతున్నట్లు సెక్షన్ 41(ఏ)ను రద్దుచేసి న్యాయవాదులకు లాభం జరిగేలా, జూనియర్ న్యాయవాదులకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ నిర్ణ యం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చె ప్పారు. అవకాశం ఉంటే ప్రత్యేక హై కో ర్టు కోసం ఈ విధమైన ఉద్యమం కాకుం డా మరో విధంగా ఉద్యమించేం దుకు న్యాయవాదులు ఆలోచన చేయాలన్నా రు. ఎంపీ వెంట దీక్ష శిబిరాన్ని సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆమరణ దీక్ష చేస్తున్న న్యాయవాదులకు సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత, జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ గడ్డం సుమన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌ఎల్ శాస్త్రి, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు వైశాలినిరెడ్డి, సూదంలక్ష్మీ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఉన్నారు.
న్యాయవాదుల బంద్‌కు మద్దతు
ప్రగతినగర్ : తెలంగాణ రాష్ట్రనికి ప్ర త్యేక హైకోర్టును మంజూరు చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ అన్నారు.గురువారం టీఎన్‌జీవోస్ భవన్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పటు చేశాకే జూనియర్ జడ్డిల నియూమకాలు చేపట్టాలని తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా ఉన్న 41(ఎ) జీవోను రద్దు చేయూలన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పటు చేయాలనే ఆందోళనలో భాగంగా ఈ నెల 21న నిజామాబాద్ నగరం బంద్‌కు బార్ అసోసియెషన్ నాయకులు ఇచ్చిన పిలుపునకు తాము పూర్తి మద్దతూ తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ ప్రభాకర్,ఎఫ్‌సీఐ భాస్కర్,రవీందర్,దాస్,నర్సింలు తదితురులు పాల్గొన్నారు.