
సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత స్ఫష్టం చేశారు. సోమవారం ఆమె ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ నిర్మాణ పనులను ఆమె పర్యవేక్షించారు. దాంతో పాటు ఆమె నగరంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఐటీ హబ్ పూర్తయితే ఖమ్మంలోనే ఉపాధి దొరుకుతుందని భరోసానిచ్చారు. ఖమ్మంతో పాటు మరో మూడు జిల్లాల్లోనూ ఐటీ హబ్‌లు నిర్మిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment