రైతులెవ్వరూ అధైర్యపడవద్దు | MP visited Bodh | Sakshi
Sakshi News home page

రైతులెవ్వరూ అధైర్యపడవద్దు

Published Sat, Aug 18 2018 12:24 PM | Last Updated on Sat, Aug 18 2018 12:24 PM

MP visited Bodh - Sakshi

నేరడిగొండ: తర్నంలో పత్తి పంట క్షేత్రాన్ని పరిశీలిస్తున్న ఎంపీ గోడం నగేశ్‌ 

భీంపూర్‌(బోథ్‌): జిల్లాలో వర్షాల తాకిడికి ఎన్నో చోట్ల పంటనష్టం జరిగిందనీ, రైతులు ఎవరూ అధైర్యపడకుండా ఉండాలని జిల్లా ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. భీంపూర్‌ మండలంలోని అర్లి(టి), వడూర్‌ గ్రామ శివారులలో జరిగిన ఆయన పరి శీలించారు. అక్కడున్న స్థానిక రైతులను పంటల సరళి, నష్టపోయిన తీరును అడిగి తెలుసుకున్నా రు. కాగా ఎక్కువ మొత్తలో పత్తితో పాటు సోయా పంటలు తీవ్రంగా నష్టపోయాయనీ, పలు చోట్ల వాగులు కోతకు గురవడంతో పత్తిపంట పూర్తిగా దెబ్బతిన్నదనీ రైతులు ఆవేదన వ్యక్తపర్చారు. రెవెన్యూ, సంబంధిత వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల రైతుల చేలలో నష్టపోయిన పంటల వివరాలను పక్కాగా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

అనంతరం నూతనంగా ఏర్పడిన కమట్వాడ గ్రామపంచాయతీలో ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. క్యాంపులో అందుతున్న సేవలను సంబంధిత వైద్యాధికారి సూరత్‌ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది చేపడుతున్న కంటి పరీక్షల్లో ఆయన కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఇందులో ఎంపీటీసీ రుద్రగంగయ్య నాయకులు పులినారాయణ, శ్రీధర్‌రెడ్డి, రాజు, సవాయి స్వామి, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. 

తాంసీలో నీట మునిగిన పంటల పరిశీలన

తాంసి(బోథ్‌): జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను, వర్షాల వల్ల ఇళ్లు కూలిన కుటుం బాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ గోడం నగేశ్‌ బాధిత కుటుంబా లకు ధైర్యమిచ్చారు. శుక్రవారం తాంసీ మండలం లోని వివిధ గ్రామాలలో భారీ వర్షాల వలన నీట మునిగిన పంటలను అధికారులతో కలిసి పరీశి లించారు. మండల కేంద్రంలో వర్షానికి కూలిన ఇండ్లను పరిశీలించి, తాంసి వాగు పొంగి ప్రవహించడంతో వాగు ఒడ్డున గల ఇండ్లలో వాగు నీరు చేరిన ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు.

అధికారులు త్వరగా సర్వే చేసి నష్టం వివరాలను అంచన వేయాలని తెలిపారు. ఇందులో తాంసీ తహసీల్దార్‌ శ్రీదేవి, వ్యవసాయాధికారి రవీందర్, ఏడీ రమేశ్, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రేంనివాస్, ఆర్‌ఐలు సుమలత, మహేందర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ, నాయకులు శ్రీధర్‌ రెడ్డి, సదానంద్, విలాస్, కాంత్‌రెడ్డి, నాగారెడ్డి తదితరులు ఉన్నారు. 

పంటచేలను పరిశీలించిన ఎంపీ

నేరడిగొండ(బోథ్‌): జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి నీట మునిగిన పంటలను ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేశ్‌ పరిశీలించారు. శుక్రవారం మండలంలోని కుమారి, కుప్టి, తర్నం గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కడెం నదీ పరివాహక ప్రాంతాల్లో పత్తి, సోయా, తదితర పంటలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఈ పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నష్టం అంచనా వివరాలను తెలుసుకొని రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లోని పంట చేలల్లో వరదనీరు ఆగి ఉంటుందని, ఆ నీటిని రైతులు బయటకు పంపాలని సూచించారు.

తడి ఆరిన అనంతరం పత్తి మొదళ్లకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించి పంటలకు మందులు పిచికారీ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు అన్ని రకాల సహాయాన్ని అందేలా చూస్తానని ఆయా గ్రామాల రైతులకు భరోసానిచ్చారు. పంట క్షేత్రాలకు స్వయంగా వెళ్లి నష్టపోయిన వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గడ్డం భీంరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు గాదె శంకర్, ఏరు రాజేశ్వర్, ఆడెపు రమేష్, రాథోడ్‌ రవీందర్, శివారెడ్డి, రాజురెడ్డి, తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement