సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పునర్విభజనలో భాగంగా జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలను తేల్చే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈనెల 22వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించగా.. 23, 24 తేదీల్లో వాటిని పరిశీలించారు. సోమవారం ఎంపీటీసీ స్థానాల తుది జాబితాను కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని 20 మండలాలకు 289 ఎంపీటీసీ స్థానాలుగా నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 మండలాల్లో 220 ఎంపీటీసీ స్థానాలను అశ్వాపురంలో 12, అశ్వారావుపేటలో 17 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. బూర్గంపాడు మండలంలో 11, చర్లలో 12, చండ్రుగొండలో 8,, చుంచుపల్లిలో 12 ఎంపీటీసీ స్థానాలను డ్రాఫ్ట్‌లో ప్రకటించారు.
దమ్మపేట మండలంలో 17, దుమ్ముగూడెంలో 13, గుండాలలో 5, జూలురుపాడులో 10 ఎంపీటీసీ స్థానాలను డ్రాప్ట్ పబ్లికేషన్ చేశారు. కరకగూడెంలో 4 ఎంపీటీసీ స్థానాలు, లక్ష్మీదేవిపల్లిలో 11, మణుగూరులో 11, ములకలపల్లిలో 10, పాల్వంచలో 10, పినపాకలో 9, సుజాతనగర్‌లో 8, టేకులపల్లిలో 14, ఇల్లెందులో 16 ఎంపీటీసీ స్థానాలుగా డ్రాప్ట్ పబ్లికేషన్‌లో ప్రకటించారు. మొత్తంగా జిల్లాలోని 21 మండలాలకు సంబంధించి 220 ఎంపీటీసీ స్థానాలను అధికారులు ఖరారు చేశారు. 21 జెడ్పీటీసీ స్థానాలకు కూడా డ్రాఫ్ట్ పబ్లికేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలను నిర్ణయించారు. జిల్లా అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగనున్నాయి.
ముసాయిదా జాబితా సిద్ధం..
భద్రాద్రి జిల్లాలో 220 ఎంపీటీసీ స్థానాలకు, 21 జెడ్పీటీసీ స్థానాలకు మండల అధికారులు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ముసాయిదా జాబితా ప్రకటించాం. దీని ప్రకారమే పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. హనుమంతు కొడింబా, జిల్లా పరిషత్ సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment