MPTC Members
-
ఎంపీటీసీ స్థానాలివే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పునర్విభజనలో భాగంగా జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలను తేల్చే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈనెల 22వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించగా.. 23, 24 తేదీల్లో వాటిని పరిశీలించారు. సోమవారం ఎంపీటీసీ స్థానాల తుది జాబితాను కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని 20 మండలాలకు 289 ఎంపీటీసీ స్థానాలుగా నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 మండలాల్లో 220 ఎంపీటీసీ స్థానాలను అశ్వాపురంలో 12, అశ్వారావుపేటలో 17 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. బూర్గంపాడు మండలంలో 11, చర్లలో 12, చండ్రుగొండలో 8,, చుంచుపల్లిలో 12 ఎంపీటీసీ స్థానాలను డ్రాఫ్ట్‌లో ప్రకటించారు. దమ్మపేట మండలంలో 17, దుమ్ముగూడెంలో 13, గుండాలలో 5, జూలురుపాడులో 10 ఎంపీటీసీ స్థానాలను డ్రాప్ట్ పబ్లికేషన్ చేశారు. కరకగూడెంలో 4 ఎంపీటీసీ స్థానాలు, లక్ష్మీదేవిపల్లిలో 11, మణుగూరులో 11, ములకలపల్లిలో 10, పాల్వంచలో 10, పినపాకలో 9, సుజాతనగర్లో 8, టేకులపల్లిలో 14, ఇల్లెందులో 16 ఎంపీటీసీ స్థానాలుగా డ్రాప్ట్ పబ్లికేషన్‌లో ప్రకటించారు. మొత్తంగా జిల్లాలోని 21 మండలాలకు సంబంధించి 220 ఎంపీటీసీ స్థానాలను అధికారులు ఖరారు చేశారు. 21 జెడ్పీటీసీ స్థానాలకు కూడా డ్రాఫ్ట్ పబ్లికేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలను నిర్ణయించారు. జిల్లా అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ముసాయిదా జాబితా సిద్ధం.. భద్రాద్రి జిల్లాలో 220 ఎంపీటీసీ స్థానాలకు, 21 జెడ్పీటీసీ స్థానాలకు మండల అధికారులు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ముసాయిదా జాబితా ప్రకటించాం. దీని ప్రకారమే పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. హనుమంతు కొడింబా, జిల్లా పరిషత్ సీఈఓ -
ఏమనుకుంటున్నావ్..?
నరసన్నపేట : మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజప్రతినిధుల సమక్షంలో ఆర్డబ్ల్యూఎస్ మహిళా ఇంజనీరు కన్నీరుమున్నీరయ్యారు. టీడీపీ ఎంపీటీసీ సభ్యుల దురుసు ప్రవర్తనతో దుఃఖాన్ని ఆపుకోలేక సమావేశం మధ్యలోనే ఆమె కార్యాలయానికి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. నరసన్నపేట మండల సమావేశంలో రక్షిత నీటి సరఫరా పద్దుపై సమీక్ష జరుగుతున్నప్పుడు ఆర్ఆడబ్ల్యూఎస్ ఏఈ హేమలత మండలంలో తాగునీటి సరఫరాపై వివరణ ఇస్తున్నారు. ఆ సమయంలో ఉర్లాం ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షుడు చమళ్ల వామనమూర్తి మాట్లాడుతూ తన పరిధిలోని పలు గ్రామాలకు తాగునీరు అందడం లేదని, బాలసీమ పంచాయతీలో నీటి కోసం గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ఏఈ స్పందిస్తూ గ్రామాల్లోకి వస్తున్నప్పుడు ఎవరూ చెప్పడం లేదని, తన దృష్టికి సమస్య తీసుకొస్తే పరిష్కరిస్తానని బదులిచ్చారు. ‘నీవు ఎప్పుడు వస్తున్నావు. నన్ను ఒక రోజూ కలవలేదు. నన్ను కలవాల్సిన బాధ్యత లేదా?’ అని వామనమూర్తి ప్రశ్నించారు. ‘వచ్చిన ప్రతిసారీ మీకు కలవాల్సిన అవసరం లేదు. మండలంలో 34 పంచాయతీలు ఉన్నాయి. 83 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామం వెళ్లినప్పుడు ఎంపీటీసీలకు కలవాలంటే ఎలా కుదురుతుంది. అలా చేయలేం’ అని ఆమె సమాధానమిచ్చారు. ఈ విషయంలో ఏఈ పద్ధతి బాగా లేదంటూ వామనమూర్తి కూర్చుండిపోయారు. అనంతరం టీడీపీ ఎంపీటీసీ సభ్యులు పీస కృష్ణ, టి.గోవిందరావు, యారబాడు ఎంపీటీసీ ప్రతినిధి పి.రమణలు లేచి ఏఈతో వాగ్వాదానికి దిగారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీనికి ఈఏ సమాధానం చెబుతుండగా పీస కృష్ణ లేచి ‘నోర్ముయ్.. ఏంటనుకుంటున్నావు.. అంటూ పత్రికలో రాయలేని భాషలో పరుషపదజాలం వాడారు. దీంతో ఏఈ మనస్తాపం చెంది ‘ఒక మహిళా అధికారిపై దురుసుగా ప్రవర్తిసారా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. సమావేశం మధ్యలోనే కార్యాలయానికి వెళ్లిపోయారు. సమస్య చెప్పడం తప్పా..? తాగునీటి ఎద్దడి ఉందని చెబుతూ సమస్యను ఆమె దృష్టికి తీసుకువెళ్లామని.. ఇది తప్పా అని చమళ్ల వామనమూర్తి అన్నారు. కష్టపడి పనిచేస్తున్నా: ఏఈ ఏఈ హేమలేత మాట్లాడుతూ తాను కష్టపడి పనిచేస్తున్నానని, రోజూ గ్రామాల్లో తిరుగుతున్నా.. వెళ్లడం లేదని చెప్పడం తగదన్నారు. ప్రతిసారీ ప్రజాప్రతినిధులకు కలవాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం తగదని వాపోయారు. సంయమనం పాటించాలి.. ఎంపీపీ పార్వతమ్మ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలని కోరారు. ఒకరిపై ఒకరు నిందారోపణలకు దిగడం మంచిదికాదన్నారు. అధికారులు సమాధానాలు ఓర్పుగా చెప్పాలని, అదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా అధికారులకు గౌరవం ఇవ్వాలని కోరారు. -
ఏంటి రాజకీయాలు చేస్తున్నారా?
మహేశ్వరం : ‘ఏంటి రాజకీయాలు చేస్తున్నారా? సమావేశంలో ఉంటే ఉండండి లేకపోతే బయటకు వెళ్లండి’ అని ఎంపీటీసీ సభ్యులపై ఎమ్మెల్యే తీగల ఆగ్రహంతో ఊగిపోయారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ సమావేశం హాలులో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామజ్యోతిలో తమకు ప్రాధాన్యత కల్పించి, గ్రామాల్లో చిప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టవద్దని పలువురు విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ప్లకార్డులతో నిరసన చేస్తున్న ఎంపీటీసీలపై ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు, ఘట్టుపల్లి ఎంపీటీసీ సలేంద్ర శ్రీశైలం గ్రామజ్యోతిలో తమను భాగస్వాములను చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తుండగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీటీసీ, సర్పంచ్‌లకు చాలా ప్రాధాన్యత ఇచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ ద్వారా కొన్ని మండలాలకే నీరు వస్తున్నాయని , పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా అని ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు. సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమవేశానికి ఎంపీటీసీలు పలువురు బహిష్కరించారు. కార్యక్రమం లో ఎంపీపీ పెంటమల్ల స్నేహసురేష్, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య యాదవ్, వైస్ ఎంపీపీ స్వప్న, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కో ఆప్షన్ సభ్యుడు షేక్ అబుబాకర్ పాల్గొన్నారు. -
ఈ నెల 22న ఎంపీటీసీ సభ్యుల నిరసన దీక్ష
పంజగుట్ట(హైదరాబాద్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంలో తమకు భాగస్వామ్యం కల్పించనందుకు నిరసనగా ఈ నెల 22వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ ఎంపీటీసీల ఫోరం తెలిపింది. అదే విధంగా నేటి నుంచి అన్ని గ్రామ, మండల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ... గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఎన్నో సార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. గ్రామంలో సర్పంచ్, వైస్ సర్పంచ్, ఆఖరుకు వార్డు సభ్యులకు కూడా స్థానం కల్పించి తమను మాత్రం విస్మరించారని తెలిపారు. తమను ఈ ప్రభుత్వం ప్రజాప్రతినిధులుగా గుర్తించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,473 మంది ఎంపీటీసీ సభ్యులు పార్టీలకు అతీతంగా ఈనెల 22న జరిగే నిరసన దీక్షలో పాల్గొంటారని కరుణాకర్ తెలిపారు. -
‘గ్రామజ్యోతి’ని బహిష్కరిస్తున్నాం..
నిజామాబాద్‌లో మంత్రి పోచారం ఎదుట ఎంపీటీసీ సభ్యుల నిరసన ప్రగతినగర్ : నిజామాబాద్ గ్రామజ్యోతి డివిజన్‌స్థాయి సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు చేపట్టిన గ్రామజ్యోతిలో తమకు సముచిత న్యాయం కల్చించలేదంటూ నిజామాబాద్ డివిజన్ మండలాల ఎంపీటీసీ సభ్యులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎదుట నిరసన తెలిపారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మంత్రి ప్రసంగిస్తుండగా వేదిక ముందు బైఠాయించారు. తమకు గ్రామజ్యోతిలో సముచిత న్యాయం కల్పించాలని, లేనిపక్షంలో నేటి నుంచి జరిగే గ్రామజ్యోతిని తమ ఎంపీటీసీల ఫోరం తరఫున బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్యెల్యేలు తమ నియెజక వర్గాల ఎంపీటీసీ సభ్యులను పక్కకు తీసుకెళ్లి బుజ్జగించారు. ఎమ్యెల్యేలు జీవన్‌రెడ్డి,ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జెడ్పీ చైర్మన్ ధపెధర్‌రాజు,వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి పాల్గొన్నారు. -
నందివర్గం ఎస్ఐ హల్చల్
బనగానపల్లె:నందవరం గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు వెంకటలచ్చమ్మ కుమారుడు శేఖర్‌గౌడ్‌ను నందివర్గం ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి అకారణంగా చితకబాదాడు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ నాయకుడనే ఒకే ఒక్క కారణంతో టీడీపీ నేతల ప్రోద్బలంతో బుధవారం సాయంత్రం రహదారిపై కొట్టుకుంటూ స్టేషన్‌కు తరలించారు. అదే రోజు రాత్రి విడిచిపెట్టాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు ఎస్ఐ తీరును నిరసిస్తూ గురువారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని, బాధితుడికి న్యాయం చేకూర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ దశలో పాణ్యం ఇన్చార్జి సీఐ దేవప్రసాద్, పాణ్యం ఎస్ఐ మురళీమోహన్‌రావుతో పాటు నంద్యాల తాలూకా ఎస్ఐ గోపాల్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ శరత్‌చంద్రారెడ్డి స్టేషన్‌కు చేరుకుని కాటసానితో చర్చలు జరిపారు. ఇంటి వంటి సంఘటన జరగడం పొరపాటేనని, పారదర్శకంగా విచారణ చేపట్టి అధికారులకు విన్నవిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బీసీ ఒత్తిడితోనే కేసులు బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఒత్తిడితోనే నియోజకవర్గంలోని పోలీసు అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులపై అకారణంగా తప్పుడు కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నట్లు కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఆవరణలోనే విలేకరులతో మాట్లాడుతూ అవుకు మండలంలోని శివరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దిలేటి హత్యకు గురైతే బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ పోతే తాము ఊరుకునేది లేదన్నారు. ఆందోళనలో కాటసాని పినతండ్రి మాజీ ఎంపిపి కాటసాని శివారెడ్డి, సోదరులు కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, బంధువులు అశ్వర్థరెడ్డి, దస్తగిరిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, అబ్దుల్‌ఖైర్, డాక్టర్ మహమ్మద్‌హుసేన్, రామ్మోహన్‌రెడ్డి, శివరామిరెడ్డి, తులసిరెడ్డి పాల్గొన్నారు. -
ఎంపీటీసీ సభ్యులను అణగదొక్కొద్దు
ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్ కర్నూలు(జిల్లా పరిషత్): ‘ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులకు నిధులు, అధికారాలు ఇస్తే ఎక్కడ బాగా పనిచేస్తారోనని.. వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని అన్ని రాజకీయ పార్టీలు ఎదగనీయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా, ఆరవ వేలుగా మార్చాయి.’’ అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఏపీ పంచాయతీ చాంబర్, జిల్లా ఎంపీటీసీల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మౌర్య ఇన్‌లోని పరిణయ ఫంక్షన్‌హాలులో ఎంపీటీసీ సభ్యుల సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇతర ప్రజాప్రతినిదుల తరహాలో ఎంపీటీసీలు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినా వారికి నామమాత్రపు గౌరవం ఇస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ చేసి ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు క్రియాశీలక అధికారాలు, నిధులు, విధులు తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా ఎంపీటీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యం కాదని, ఎంపీటీసీలకు అందుతున్న గౌరవం ప్రధానమన్నారు. రాజకీయాలకు స్థానిక ప్రజాప్రతినిదులందరూ పంచాయతీరాజ్ పార్టీగా ఉండాలన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలొస్తే ముందుగా ప్రశ్నించేది స్థానిక ప్రజాప్రతినిదులనేనన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక అవసరాలు తీర్చే బాద్యత పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. స్థానిక సంస్థలన్నీ ప్రభుత్వాలుగా మారినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిదులకు ఇచ్చే గౌరవ వేతనం కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెంచిన మాదిరిగానే ఇక్కడా స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని, తక్షణమే నిధులు, విధులు, బాధ్యతలు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పమిడి వెంకటరావు మాట్లాడుతూ ఎంపీటీసీల ఉద్యమానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. స్థానిక సంస్థల్లో సగం నిధులు ఎంపీటీసీల ద్వారా ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ పనులను గ్రామస్థాయిలో రూ.5లక్షలకు, మండల స్థాయిలో రూ.10లక్షలకు పెంచాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఏపీ సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఏపీ చాంబర్ ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య, విశాఖ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు వినోద్‌రాజు, కృష్ణాజిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు మురళి, చిత్తూరు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కిరణ్‌యాదవ్, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మీనాక్షినాయుడు, ఎంపీపీల సంఘం జిల్లా కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా ప్రతినిధులపై టీడీపీలో చిన్నచూపు
అనపర్తి:టీడీపీకి చెందిన పలువురు నాయకులు పార్టీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధులను చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీకి చెందిన అనపర్తి-2 సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యురాలు చిర్ల శ్రీదేవి ఆరోపించారు. భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసిన శ్రీదేవి ఈ నెల 13న నిద్ర మాత్రలు మింగారు. ఇరుగుపొరుగువారు, పుట్టింటి వారు ఆస్పత్రిలో చేర్చగా గండం గడిచి కోలుకున్న ఆమె సోమవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భర్త నటశేఖరరెడ్డికి, తనకు మధ్య ఉన్న తగాదాలను పరిష్కరిస్తామని పార్టీ నాయకులు అనడంతో ఈ నెల 13న పార్టీ స్థానిక కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. అయితే పార్టీ నాయకులు కర్రి ధర్మారెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి ఏకపక్షంగా తన భర్తకే వత్తాసు పలికారని ఆరోపించారు. అదే రోజు సాయంత్రం భర్త, భర్త అన్న కుమారుడు తనను చంపేందుకు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. అనంతరం తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించానన్నారు. అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యురాలైన తనకు పార్టీ నాయకుల వల్ల న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణికావేశంలో తాను నిద్ర మాత్రలు మింగ గా ఇంతవరకూ పరామర్శించిన నాయకుడు లేకపోవడం బాధాకరమన్నారు. పార్టీ నాయకులు తనకు అన్యాయం చేసినా పార్టీని వీడే ప్రసక్తే లేదని, పార్టీలోనే ఉండి వారి అన్యాయాలను ఎండగడతానని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. -
స్థానిక ‘ఉప’ సమరం
విశాఖపట్నం/నక్కపల్లి: జిల్లాలో నాలుగు పంచాయతీ సర్పంచ్‌లు, 124 వార్డు సభ్యులు, 21 ఎంపీటీసీ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకు ఏర్పాట్లు, బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలని ఎన్నికల సంఘ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రక్రియలో భాగంగా మొదటి దశలో పోలింగ్స్టేషన్ల ముసాయిదా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, తుదిజాబితా ప్రకటనవంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో ఎన్నికలప్పుడు నామినేషన్ దాఖలుకాని పంచాయతీల్లోను, ఎన్నికల అనంతరం వివిధ కారణాల వల్ల ఖాళీఅయిన సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవుల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 15న పోలింగ్స్టేషన్ల ముసాయిదా ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను 17న స్వీకరిస్తారు. 18న పరిశీలన,19న తుదిజాబితా ప్రకటిస్తారు. ఈమేరకు ఏఏ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలన్నదానిపై జిల్లాపరిషత్ అధికారులు దృష్టి సారించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది మార్చి పదో తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించిన గుర్తులనే ఇప్పుడూ వాడాలని ఎన్నికలసంఘం నిర్ణయించింది. ఏజెన్సీ పరిధి జీకేవీధి మండలం గాలికొండ, చింతపల్లి మండలం బలపం పంచాయతీలకు అప్పట్లో నామినేషన్లు దాఖలుకాలేదు. ఈ రెండు పంచాయతీల్లో సర్పంచ్‌తోపాటు అన్ని వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నాతవరం మండలం విబి అగ్రహారం సర్పంచ్ చనిపోయారు. నర్సీపట్నం మండలం ధర్మసాగరం సర్పంచ్ రాజీనామా చేశారు. ఈ రెండు చోట్ల సర్పంచ్ పదవులకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వార్డుల విషయానికొస్తే దేవరాపల్లిమండలం కొత్తపల్లి,కాశీపురం, పరవాడమండలం కన్నూరు,రావాడ, పెందుర్తిమండలం ఎస్ఆర్పురం, సబ్బవరం మండలం పైడివాడఆగ్రహారం, అమృతపురం,అచ్చుతాపురం మండలం దోసూరు, పెదపాడు,మాడుగుల మండలం ఎం.కోడూరు, ముకుందపురం, మాకవారిపాలెం మండలం కోడూరు, కే. అగ్రహారం, నక్కపల్లిమండలం గొడిచర్ల, ముకుందరాజుపేట, నర్సీపట్నంమండలం వేములపూడి,పాయకరావుపేటమండలం పి.లక్ష్మీపురం, సీతారాంపురం, యలమంచిలి మండలం లక్కవరం, రాంబిల్లి మండలం కుమార పల్లి, జీకేవీధి మండలం మొండిగెడ్డ,జర్రెల, చింతపల్లిమండంలో తమ్మంగుల, కుడుమసారె, ముంచంగిపుట్టు మండలం రంగబయలు, బుంగాపుట్టు,బోసిపుట్టు,అనంతగిరి మండలం ఎన్ఆర్పురం, లుంగపర్తి, గుమ్మకోట, పెదబయలుమండలం జమ్మిగుడ, కుంతర్ల,బొంగరం, లింగేటి,గుల్లెలు, గొమ్మంగి, కొయ్యూరు మండలం బూదరాళ్ల, మంప, రేవళ్లు గ్రామాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన వార్డులకు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఎంపీటీసీ సెగ్మెంట్లకు.. జిల్లాలోని 8 మండలాల్లో 21 ఎంపీటీసీ స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నిక నిర్వహించలేదు. చింతపల్లి మండలం చింతపల్లి-1, చింతపల్లి-2, గొందిపాకలు, కుడుంసారె, తమ్మంగుల సెగ్మెట్లు, పాడేరు మండలం వంట్లమామిడి, వి. మాడుగుల మండలం మాడుగుల-2, మాడుగుల-3, కె.జె.పురం-2, పెదబయలు మండలం జామిగూడ, ఇంజరి , జి.మాడుగుల మండలం గడుతూరు, గెమ్మిలి, కోరాపల్లి , కోటవురట్ల మండలం కోటవుట్ల-2 , పాయకరావు పేట మండలం పాయకరావుపేట-7, కుమరాపురం , ముంచంగిపుట్టు మండలం మాకవరం, పెదగూడ, బరడ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
ఫిరాయిస్తే అనర్హత వేటే
సాక్షిప్రతినిధి, నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీనుంచి ఎన్నికై..వేరే పార్టీవైపు చూస్తున్నారా...? తస్మాత్ జాగ్రత్త. ఎన్నికైన పార్టీ ఆదేశాలను, విప్‌లను ధిక్కరించే వారిపై తక్షణమే అనర్హత వేటు పడుతుంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 2003లో పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణల వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎన్నికైన పార్టీ ఆధేశాలను ధిక్కరిస్తే ఆ మరుక్షణమే వారిపై అనర్హత వేటు ఖాయమని చట్టాలు చెబుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టే చర్యలు తెరవెనుక సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం, ఫిరాయింపు నిరోధక చట్టాలను నిపుణులు ఉటంకిస్తున్నారు. పార్టీ మారే వారికి చట్టంలోని పకడ్బందీ నిబంధనలు షాక్ కొట్టించకమానవని స్పష్టంచేస్తున్నారు. అనర్హత వేటు వల్ల అప్రతిష్ఠపాలవ్వడంతో పాటు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతతో అక్కడితోనే రాజకీయ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదమూ తప్పదంటున్నారు. గతంలో ఇలా పార్టీలు మారిన వారు రాజకీయంగా తెరమరుగైన సందర్భాలు అనేకమున్నాయని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా స్థానికసంస్థల్లో పార్టీల సిద్ధాంతాలను అనుసరించి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకున్న వారే ఆ తరువాత కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నత స్థానాల్లోకి వెళ్లగలిగారు. స్వల్ప కాలిక ప్రయోజనాలకోసం పార్టీలు మారి తే ఆ తరువాత దీర్ఘకాలంగా రాజకీయంగా చాలా నష్టపోకతప్పదు. ఇలాంటి తరుణంలో జెడ్పీ స్థానాలను కైవసం చే సుకోవడానికి అధికార పార్టీనేతలు స్థానిక సంస్థల ప్రతినిధులను అనేకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నా నేతలు మాత్రం పునరాలోచనలో పడుతున్నారు. ప్రజల తీర్పును, పార్టీ నిర్ణయాన్ని భవిష్యత్తును పణంగా పెట్టడం పలువురు నేతలకు రుచించడం లేదు. పార్టీని ధిక్కరిస్తే వెంటనే వేటు పడడం, ఆపై ప్రజలు నిరాదరించడం ఇవన్నీ ఎందుకు? బంగారు భవిష్యత్తును వదులుకోవడమెందుకు? అన్న ఆలోచనలో పడుతున్నారు. అయినా కొన్ని చోట్ల కొంతమంది ఆమాయకులను ఆసరా చేసుకొని అధికారపక్షం వారు చట్టాన్ని వక్రీకరిస్తున్నారు. వారెన్ని చెప్పినా చట్టం పకడ్బందీగా ఉన్నందున అనర్హత వేటు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ జారీ చేసే విప్‌కు అనుకూలంగా ఓటు వేయాలే తప్ప, ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురవుతారని తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముందంటే... రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అంటే 1985 కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి, దానిని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అటు తరువాత 2003లో అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ చట్టానికి కొన్ని సవరణలు జరిగాయి. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు ఎవరైనా కూడా తన పార్టీ స్వభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతనికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి, ఆ పార్టీకి రాజీనామా సమర్పించడానికి తేడా ఉందని, ఈ రెండూ పదాలు కూడా సమనార్ధాకాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేయనప్పటికీ, స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవచ్చునని తెలిపింది. అదే విధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు అందులో పాల్గొని ఓటు వేయడం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం చేసినప్పుడు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఒకవేళ సదరు రాజకీయ పార్టీ తమ సభ్యుడి ధిక్కారాన్ని 15 రోజుల్లోపు ఖండించని పక్షంలో అతనికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంతేకాక ఏ పార్టీ టికెట్ మీద అయితే ఓ సభ్యుడు గెలిచారో, ఆ వ్యక్తి ప్రతిపక్ష నేతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరితే ఆ వ్యక్తి తన పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2003లో తీసుకువచ్చిన చట్ట సవరణ ప్రకారం పార్టీలోని మూడింట రెండు వంతుల మంది సభ్యులు వేరే పార్టీకి వెళ్లిన సందర్భాన్ని ఫిరాయింపుగా పరిగణించడానికి వీల్లేదు. చట్ట సభలకు ఎన్నికైన వెంటనే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఇతర రాజకీయ పార్టీలో చేరితే అతనికీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. -
క్యాంపులో ఉండం.. ఇంటికి వెళ్తాం!
యాచారం: వెళ్లాలనుకున్న పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తున్నారు. నచ్చిన భోజనం పెడుతున్నారు.. సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.. కానీ ఇంటికే వెళ్తామంటున్నారు యాచారం మండల ఎంపీటీసీ సభ్యులు. యాచారం మండలంలో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారడంతో స్థానిక టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీలను కలిపి క్యాంపునకు తరలించారు. యాచారం ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతినాయక్ను ఎంపీపీని చేయడమే వీరి లక్ష్యం. ఇరవై రోజుల క్రితం ఇంటి నుంచి బయల్దేరిన వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దేవాలయాలను, ముఖ్యమైన పట్టణాలను సందర్శించారు. ఎంపీటీసీ జ్యోతినాయక్ మామ బుచ్చానాయక్ క్యాంపును నడిపిస్తున్నాడు. సభ్యులు ఏం అడిగితే అది సమకూరుస్తున్నారు. బుచ్చానాయక్ అవస్థలు చూస్తున్న ఎంపీటీసీలు మాత్రం.. ఎందుకు ఇంత ఖర్చు వెళ్లిపోదాం.. అంటున్నారట. ఎన్నిక రోజున తప్పకుండా జ్యోతినాయక్ మద్దతు తెలిపి ఎంపీపీ ఎన్నికకు సహకరిస్తామని భరోసా ఇస్తున్నారట. కానీ క్యాంపును వెనకుండి నడిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు క్యామ మల్లేష్లు మాత్రం ఇంకో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనీ.. అప్పటిదాకా తిరిగి రావొద్దని చెబుతున్నారట. రెండు రోజులుగా వీరి క్యాంపు ఖమ్మం జిల్లా భద్రచలంలో కొనసాగుతోంది. భార్యాపిల్లలతో వెళ్లిన ఎంపీటీసీ సభ్యులు కొందరు.. స్కూళ్లు ప్రారంభమయ్యాయని, ఇంటికి వెళ్దామని తొందర పెడుతున్నట్టు సమాచారం. వర్షాలు కురిస్తే వ్యవసాయపనులు మొదలయ్యే అవకాశాలున్న కారణంగా వ్యవసాయం ఉన్న మరికొందరు.. వెంటనే ఇంటికెళ్దామని ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు. యాచారం మండలంలో 14 మంది ఎంపీటీసీ సభ్యులకుగానూ యాచారంతోపాటు చింతపట్ల, నక్కర్తమేడిపల్లి, మంతన్‌గౌరెల్లి, చౌదర్పల్లి, గునుగల్, కొత్తపల్లి, తాడిపర్తి, మాల్ గ్రామాలకు చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి నాయక్‌కు ఎంపీపీని చేయడానికి మద్దతుగా క్యాంపులో ఉన్నారు. ఎంపీపీ ఎన్నికలో జాప్యం జరుగుతుండడంతో వారంతా ఇంటికి చేరుకోవడానికి ఆరాట పడుతున్నారు. గత 20 రోజులుగా క్యాంపు నిర్వాహణ ఖర్చు రూ.లక్షలు దాటినందున ఎంపీపీ ఎన్నిక తేదీ ఎప్పుడొస్తుందోనని.. నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు.