‘హంగ్’ ఆసక్తికరం | MPTC's Camp in hung areas | Sakshi
Sakshi News home page

‘హంగ్’ ఆసక్తికరం

Published Wed, Jun 11 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

‘హంగ్’ ఆసక్తికరం

‘హంగ్’ ఆసక్తికరం

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనున్న నేపథ్యంలో ‘మండల’ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ము ఖ్యంగా హంగ్ ఫలితాలొచ్చిన మండలాల్లో మారుతున్న సమీకరణాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రా ని పలు మండల పరిషత్ పీఠాలను ఎగురేసుకు వెళ్లేం దుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఎక్కువ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు మార్గం సుగమమవుతోంది. మరికొన్ని మండలాల్లో కాంగ్రెస్ కూడా ఈ పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
 
నజరానాలతో ఎర

జిల్లాలో 52 మండల పరిషత్‌లకు 25 మండల పరిషత్‌లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ మండలాల ఎంపీపీ పీఠాలు దక్కించుకోవాలంటే స్వతంత్రులు, ఇతర పార్టీల ఎంపీటీసీ సభ్యుల మద్దతు తప్పనిసరి. దీంతో ఈ పీఠాలు ఆశించిన నేతలు తమకు అవసరమైన మద్దతు కూడ గట్టేందుకు తంటాలు పడుతున్నారు. తమకు మద్దతిచ్చిన సభ్యులకు పెద్ద మొత్తంలో నగదుతోపాటు, మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని ఇస్తామంటూ ఎరవేస్తున్నారు. మరోవైపు హంగ్ ఫలితాలొచ్చిన ఈ మండలాల్లో ఎంపీటీసీల క్యాంపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని ఆయా మండలాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే..
     
బేల మండల పరిషత్ పీఠం దక్కాలంటే ఆరుగురు ఎంపీటీసీల మద్దతు ఉండాలి. కానీ ఏ పార్టీకి ఈ మె జార్టీ రాలేదు. టీఆర్‌ఎస్, బీజేపీలు నాలుగేసి ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ రెండు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి ఎంపీపీ పీఠాన్ని ద క్కించుకునేందుకు పావులు కదుపుతుండగా, స్వతం  త్ర ఎంపీటీసీతోపాటు మరో సభ్యుడి మద్దతుతో చైర్మన్ స్థానం కోసం టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది.
     
 ఇచ్చోడలో 15 ఎంపీటీసీ స్థానాలకు మూడు స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్ స్వతంత్ర ఎంపీటీీసీతోపాటు మరో సభ్యుని మద్దతుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
     
 బజార్‌హత్నూర్ మండలంలో కూడా రెండు స్థానాల కే పరిమితమైన టీఆర్‌ఎస్ టీడీపీ సభ్యుల మద్దతుతో ఎంపీపీ స్థానాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది.
     
 బోథ్ ఎంపీపీ స్థానానికి టీఆర్‌ఎస్‌లోనే ఇద్దరు ఎంపీటీసీలు పోటీ పడుతున్నారు. ఇతర పార్టీ సభ్యుల మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బేరసారాలు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ కూడా ఎంపీపీ పీఠంపై దృష్టి సారించింది.
     
 ఆసిఫాబాద్ ఎంపీపీ స్థానంపై రసవత్తరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఆరేసీ ఎంపీటీసీ స్థానాలు గె లుచుకున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు టీడీపీ, సీపీఐ ఎంపీటీసీల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో టీడీపీకి చెందిన ఓ ఎంపీటీసీ టీఆర్‌ఎస్ వైపు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
     
 వాంకిడి మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలను గె లుచుకున్న టీడీపీ మరో సభ్యుని మద్దతుతో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు క్యాంపు రాజకీయా లు నడుపుతోంది. ఎంపీపీ పీఠం దక్కించుకోవాలం టే ఇంకో సభ్యుని మద్దతు తప్పనిసరి అవుతోంది.
     
 నిర్మల్‌లో 15 ఎంపీటీసీ స్థానాల్లో ఆరు స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకోగా, నాలుగు స్థానాల్లో బీఎస్పీ ఎంపీటీసీలు విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్‌ఎస్ లో చేరనుండడంతో ఈ ఎంపీపీ స్థానం టీఆర్‌ఎస్‌కు గాని, బీఎస్పీకి కానీ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కీలకం కానుండటం విశేషం. సారంగాపూర్‌లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది.
     
 లోకేశ్వరం మండలం ప్రాదేశిక ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. పది ఎంపీటీసీ స్థానాల్లో ఐదు చొప్పున టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు గెలుచుకున్నాయి. అయితే కాంగ్రెస్ ఎంపీటీసీ ఒకరు మద్దతుతో ఈ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది.
     
 దండేపల్లిలో 14 ఎంపీటీసీ స్థానాలకు ఏడు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ మరో స్వతంత్ర ఎంపీటీసీ మద్దతుతో పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
     
 బెల్లంపల్లిలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు నాలుగు చొప్పున కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు కైవసం చేసుకోగా, ఎంపీపీ స్థానం మాత్రం టీఆర్‌ఎస్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌లోనే రెండు శిబిరాలు కొనసాగుతుండడం గమనార్హం.
     
మందమర్రిలో 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అత్యధికంగా సీపీఐ ఐదు స్థానాలను గెలుచుకోగా, కాం గ్రెస్ మూడు, టీఆర్‌ఎస్, టీడీపీ ఒక్కొక్కటి చొప్పున విజయం సాధించారు. ఇక్కడ నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అయితే సీపీఐ, కాంగ్రెస్‌కు కాని ఎంపీపీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
     
కాగజ్‌నగర్‌లో 15 ఎంపీటీసీ స్థానాలుండగా ఆరుచోట్ల కాంగ్రెస్, ఐదుచోట్ల టీఆర్‌ఎస్ విజయం సాధించింది. బీజేపీ, టీడీపీ సభ్యులతో టీఆర్‌ఎస్ క్యాంప్ నిర్వహిస్తోంది.
     
ఉట్నూర్‌లో 18 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ తొమ్మిది గెలుచుకోగా, ఎంఐఎం, ఇండిపెండెంట్ సభ్యుల మద్దతు టీఆర్‌ఎస్‌కు ఉంది. కాని టీఆర్‌ఎస్‌లోనే ఎంపీపీ స్థానం కోసం ఐదుగురు ఎంపీటీసీలు పోటీ పడుతుండటం రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement