ఆమనగల్లు: ఎన్నిక అనంతరం పాలకవర్గం విజయోత్సవం
గ్రేటర్ పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల పర్వం ముగిసింది. 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా...సోమవారం 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో పాలకులు కొలువుదీరారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు పదవీ స్వీకారం చేశారు. వీరిలో మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పీఠాలు దక్కించుకున్నారు. కొత్త పొత్తులు, జంపింగ్ జిలానీలు, అనూహ్య పరిణామాల మధ్య కొన్నిచోట్ల పదవులు తారుమారయ్యాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక కొత్త పాలకుల ప్రొఫైల్ వివరాలు ఇలా..
ఇబ్రహీంపట్నం
చైర్ పర్సన్: కప్పరి స్రవంతి
వయస్సు: 29
విద్యార్హత: ఎంబీఏ(హెచ్‌ఆర్)
కుటుంబం: భర్త కప్పరి చందు, ఇద్దరు కూతుళ్లు కుందనిక, వెరొనిక
రాజకీయ నేపథ్యం: మామ కప్పరి లక్ష్మయ్య ఇబ్రహీంపట్నం చివరి సర్పంచ్‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన చేసిన అభివృద్ధి గెలుపునకు కలిసొచ్చింది.
వైస్ చైర్మన్: ఆకుల యాదగిరి
వయస్సు: 59
విద్యార్హత: ఇంటర్
వృత్తి: వ్యవసాయం, రియల్‌ఎస్టెట్ వ్యాపారం
కుటుంబం: భార్య వసంత, ఇద్దరు కూతుళ్లు క్రాంతి, నాగరాణి, కుమారుడు హరికాంత్
రాజకీయ నేపథ్యం: టౌన్ మున్సిపాలిటీగా ఇబ్రహీంపట్నం ఉన్నప్పుడు పెద్దనాన్న ఆకుల చంద్రయ్య కౌన్సిలర్, తదుపరి సొంత అన్నవదినలు శ్రీరాములు, సరోజలు సర్పంచ్‌లుగా పనిచేశారు.
దుండిగల్
చైర్‌పర్సన్:సుంకరి కృష్ణవేణి
పుట్టిన తేది: మే 14, 1990
కుటుంబం: భర్త శంభీపూర్ కృష్ణ,
సంతానం: కుమార్తెలు మీనాక్షి, యామిని
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సోదరుడి భార్య కృష్ణవేణి. భర్త,
బావలు టీఆర్‌ఎస్‌లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తుండగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో 25వ వార్డు నుంచి గెలుపొంది మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
వైస్ చైర్మన్: తుడుం పద్మారావు
పుట్టిన తేదీ: అక్టోబర్ 8, 1975
కుటుంబం: భార్య అన్నపూర్ణ,
సంతానం: ప్రణీత్, ప్రణయ్
విద్యార్హత: పదవ తరగతి
రాజకీయ నేపథ్యం: 1994లో బహదూర్‌పల్లి గ్రామ వార్డు సభ్యుడిగా ఎన్నికై 1999 వరకు ఉప సర్పంచ్‌గా పని చేశారు. 2014లో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీలో జిల్లా దళిత మోర్చ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మూడేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు.
నాగారం
మున్సిపాలిటీ చైర్మన్:కౌకుట్ల చంద్రారెడ్డి
పుట్టిన తేదీ: జూలై 1963
చదువు: 7వ తరగతి.
కుటుంబం: భార్య కౌకుట్ల లలిత, రాహుల్‌రెడ్డి, కొండల్‌రెడ్డి
రాజకీయ జీవితం:
1997లో నాగారం
పంచాయతీ వార్డు సభ్యుడు, 2002లో ఉపసర్పంచ్, 2007లో ఇన్‌చార్జి సర్పంచ్. 2014 నుంచి 2019వరకు నాగారం
సర్పంచ్‌గా పనిచేశారు.
మున్సిపల్ వైస్ చైర్మన్:బండారు మల్లేష్‌యాదవ్
పుట్టిన తేదీ : 1–7–74
విద్యార్హత : పదో తరగతి
కుటుంబం : బి.రమాదేవి
సంతానం : శ్రీయా యదవ్, శ్రీజన్ యాదవ్
రాజకీయ నేపథ్యం: కొత్తగా ఏర్పడిన నాగారం మున్సిపాలిటీలో 13వ వార్డు నుంచి 65 ఓట్ల తేడాతో గెలుపొందారు.
తూంకుంట
మున్సిపల్ చైర్మన్:కారింగుల రాజేశ్వరరావు
పుట్టిన తేది: 08/07/1973
విద్యార్హత: 10వ తరగతి
కుటుంబం: భార్య సుప్రియ,
సంతానం: ప్రణవ్, భసంత్
రాజకీయ నేపథ్యం: ఏమీ లేదు
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్: పన్నాల వాణివీరారెడ్డి
పుట్టిన తేది: 09/05/1972
విద్యార్హత: 10వ తరగతి
కుటుంబం: భర్త పన్నాల వీరారెడ్డి
సంతానం: సుష్మరెడ్డి, రిష్మారెడ్డి.
రాజకీయ నేపథ్యం: ఏమీ లేదు
జల్‌పల్లి
మున్సిపాలిటీ చైర్మన్: అబ్దుల్లా బిన్ హామేద్ సాది.
పుట్టిన తేది: 1992 ఫిబ్రరి 21.
విద్యాభ్యాసం: బీకాం.
కుటుంబ నేపథ్యం: భార్య,కుమారుడు సంతానం
రాజకీయ నేపథ్యం: జల్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికైన అబ్దుల్లా బిన్ హామెద్ సాది స్వయనా రెజ్లర్(మల్లయోధుడు). మజ్లిస్ పార్టీ జల్‌పల్లి మున్సిపాలిటీ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న అతడి తండ్రి నుంచి రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు.
వైస్ చైర్మన్: ఫర్హానా నాజ్.
పుట్టిన తేది: 1994 ఆగస్ట్ 7
విద్యాభ్యాసం: డిగ్రీ కుటుంబం: భర్తతో పాటు ముగ్గురు పిల్లలు సంతానం.
రాజకీయ నేపథ్యం: గృహిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి వైస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. తన సోదరుడి(సయ్యద్ యూసుఫ్ పటేల్–టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు) రాజకీయాన్ని ఆదర్శంగా తీసుకొని టీఆర్‌ఎస్ తరపున టికెట్ పొంది మజ్లిస్‌ను మట్టి కరిపించింది.
దమ్మాయిగూడ
మున్సిపల్ చైర్ పర్సన్: వసుపతి ప్రణీతాగౌడ్
పుట్టిన తేదీ : 26–12–1988
విద్యార్హత : బీకాం.
కుటుంబం: భర్త వసుపతి శ్రీకాంత్‌గౌడ్,
సంతానం: హాసిని, శ్రీతేజ
రాజకీయ నేపథ్యం: 2014 నుంచి 2019 వరకు వార్డుసభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి 216 ఓట్ల తేడాతో గెలుపొందారు.
మున్సిపల్ వైస్ చైర్మన్: మాదిరెడ్డి నరేందర్‌రెడ్డి
పుట్టిన తేదీ : 22–2–1975
విద్యార్హత : ఇంటర్
కుటుంబం : భార్య పావని రెడ్డి,
రితీష్‌రెడ్డి, తనుష్‌రెడ్డి
రాజకీయ నేపథ్యం: 2007 నుంచి 2012 వరకు ఉపసర్పంచ్‌గా, 2014 నుంచి 2019 వరకు వార్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 16వ వార్డు నుంచి 60 ఓట్ల తేడాతో గెలుపు.
ఘట్‌కేసర్
మున్సిపల్ చైర్ పర్సన్: ముల్లి పావనిజంగయ్య యాదవ్
పుట్టిన తేది: 1979 జనవరి 10
విద్యార్హత: ఇంటర్
కుటుంబం: భర్త: జంగయ్యయాదవ్
సంతానం: మేఘన, సౌమ్య, అర్చన
రాజకీయ నేపథ్యం:
గృహిణి. నూతనంగా ఏర్పడిన ఘట్‌కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డు నుంచి 281 ఓట్ల తేడాతో విజయం సాధించింది.
వైస్ చైర్మన్: పలుగుల మాధవరెడ్డి
పుట్టిన తేది: 1972 ఏప్రిల్ 4
విద్యార్హత: డిగ్రీ
కుటుంబం: భార్య: మమత
సంతానం: ప్రణయ్‌రెడ్డి, రణంత్‌రెడ్డి
రాజకీయ నేపథ్యం:
పార్టీలో పని చేసిన అనుభవంతో నూతనంగా ఏర్పడిన ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో 9వ వార్డు నుంచి 270 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
శంషాబాద్
చైర్ పర్సన్ః కొలను సుష్మారెడ్డి
వయసుః 45
విద్యార్హతః ఇంటర్
కుటుంబంః భర్త మహేందర్‌రెడ్డి శంషాబాద్ పీఏసీఎస్ చైర్మన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ కుమార్తె, కుమారుడు రుష్యేందర్‌రెడ్డి అఖిలారెడ్డి
రాజకీయ నేపథ్యంః మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు, సిరీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు. భర్త టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు.
వైస్ చైర్మన్ః బండి గోపాల్‌యాదవ్
వయసు 33
విద్యార్హత: బీఏ
కుటుంబంః భార్య పుష్పలత,
కుమారులు సాత్విక్, మనీష్
రాజకీయ నేపథ్యంః ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకుడిగా.. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశాడు. ఏడాది కిందటే టీఆర్‌ఎస్‌లో చేరారు.
తుర్కయంజాల్
చైర్ పర్సన్ పేరు:మల్‌రెడ్డి అనురాధ
భర్త పేరు: మల్‌రెడ్డి రాంరెడ్డి
విద్యార్హత: ఇంటర్మీడియట్ (డిస్ కంటిన్యూ)
రాజకీయ నేపథ్యం: 1995–2001 వరకు తొర్రూర్ సర్పంచ్‌గా పనిచేశారు.
పిల్లలు: ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు (మల్‌రెడ్డి సాయితేజ్ రెడ్డి, కావ్య, దివ్య)
ఇద్దరు కుమార్తెలు డాక్టర్లు.
వైస్ చైర్ పర్సన్: గుండ్లపల్లి హరిత
భర్త పేరు: గుండ్లపల్లి ధన్‌రాజ్‌గౌడ్
వయస్సు: 42
విద్యార్హత: బీకాం
రాజకీయ నేపథ్యం: 2014–2019 వరకు ఎంపీపీగా పనిచేశారు.
కుటుంబం: ఇద్దరు కుమారులు(ప్రీతమ్ రాజ్, ప్రణవ్ రాజ్)
భర్త ధన్‌రాజ్‌గౌడ్ 2008–2013 వరకు ఉప సర్పంచ్‌గా పనిచేశారు.
ఆదిబట్ల
మున్సిపాలిటీ చైర్ పర్సన్: కొత్త ఆర్తిక
వయస్సు : 28 సంవత్సరాలు
చదువు : బీఎస్‌సీ
భర్త :కొత్త ప్రవీణ్
వృత్తి : గృహిణి
రాజకీయ నేపథ్యం : మామ కొత్త యాదగిరిగౌడ్, అత్త ప్రమీల కొంగర్‌కాలన్ మాజీ సర్పంచ్‌లు
పిల్లలు : ఇద్దరు కుమారులు
వైస్ చైర్‌పర్సన్ :కోరే కళమ్మ
వయస్సు : 39 సంవత్సరాలు
చదువు : పదవ తరగతి
వృత్తి : గృహిణి
రాజకీయ నేపథ్యంః ఈమె ఇంతుకుముందు ఆదిబట్ల ఎంపీటీసీగా పనిచేశారు.
తుక్కుగూడ
మున్సిపాలిటీ చైర్మన్ :కాంటేకర్ మధుమోహన్
వయస్సు : 32 సంవత్సరాలు
తల్లిద్రండులు : జగత్, స్వరూప
భార్య : మౌనిక
వృత్తి : రియల్ ఎస్టేట్ వ్యాపారం
రాజకీయ నేపథ్యం : రావిర్యాల గ్రామ బీజేపీ పార్టీ సామాన్య కార్యకర్త
వైస్ చైర్మన్ : భవాని వెంకట్‌రెడ్డి
వయస్సు : 50
భార్య : ఉదయ శ్రీ
వృత్తి : రియల్ ఎస్టేట్ వ్యాపారం
పిల్లలు :ఒక కుమారుడు, ఒక కుమారై
రాజకీయ అనుభవం : గతంలో తుక్కుగూడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా పని చేశారు.
మణికొండ
చైర్మన్: కస్తూరి నరేందర్‌ముదిరాజ్
భార్య: లావణ్య, మాజీ సర్పంచ్
కుటుంబం: ఇద్దరు కుమారులు
చదువు: 10వ తరగతి
గ్రామం: పుప్పాలగూడ
రాజకీయ నేపథ్యంః రాజకీయం (కాంగ్రెస్)
వైస్ చైర్మన్: కొండకళ్ల నరేందర్‌రెడ్డి
భార్య: సుమతి
పిల్లలు: ఇద్దరు కూతుర్లు
చదవు: ఇంటర్
గ్రామం: మణికొండ
రాజకీయ నేపథ్యంః రాజకీయం(బీజేపీ)
నార్సింగి
చైర్‌పర్సన్: దారుగుపల్లి రేఖ
భర్త: డి.యాదగిరి
పిల్లలు: ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు
చదువు: 6వ తరగతి
గ్రామం: గౌలిదొడ్డి
రాజకీయ నేపథ్యంః కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం
వైస్ చైర్మన్: గొర్ల వెంకటేశ్‌యాదవ్
భార్య: జి.అరుణజ్యోతి
పిల్లలు: ఒక కుమారుడు, ఒక కూతురు
చదువు: పదవ తరగతి
గ్రామం: నార్సింగి
రాజకీయ నేపథ్యంః రాజకీయం, ఒక సారి టీడీపీ నుంచి సర్పంచ్, ఆ తర్వాత టీఆర్‌ఎస్, రియల్ ఎస్టేట్.
శంకర్‌పల్లి
మున్సిపల్ చైర్‌పర్సన్ : సాత విజయలక్ష్మి
వయస్సు: 35 కుటుంబం: భర్త సాత ప్రవీణ్‌కుమార్. సంతానం: కుమారుడు మణిరుద్రా„Š, కూతురు హన్సిక రాజకీయ నేపథ్యం: మామ సాత ఆత్మలింగం శంకర్‌పల్లి మాజీ సర్పంచ్, భర్త ప్రవీణ్‌కుమార్ శంకర్‌పల్లి మాజీ
ఉప సర్పంచ్ పని చేశారు. నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండటం, పేదలకు
ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆపదలో ముందుకు రావడం కలిసొచ్చింది.
వైస్ చైర్మన్: భానురి వెంకట్‌రాంరెడ్డి
వయస్సు: 64,
విద్యార్హత: ఇంటర్
భార్యపేరు: ప్రభావతి
సంతానం: శ్రీకాంత్‌రెడ్డి, శశికాంత్‌రెడ్డి
రాజకీయ నేపథ్యం: శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ, మార్కెట్ కమిటీ వైస్ ఎంపీపీ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించడం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, నమ్మిన మనుషుల వెంబడి ఉండటం.
ఆమనగల్లు
చైర్మన్ః నేనావత్ రాంపాల్
వయసుః 42
విద్యార్హతః ఎస్‌ఎస్‌సీ
కుటుంబంః భార్య నీల, కుమారుడు శివాజీనాయక్, కూతురు నిఖిత
రాజకీయ నేపథ్యంః 2013లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమనగల్లు రెండవ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల బీజేపీలో చేరారు. ఆమనగల్లు 3వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
వైస్ చైర్మన్ః భీమనపల్లి దుర్గయ్య
వయసుః 45
విద్యార్హతః ఇంటర్మీడియట్
కుటుంబంః భార్య శివలక్ష్మి, కుమారులు:
పవన్‌కళ్యాణ్, ప్రణీత్‌కుమార్
రాజకీయ నేపథ్యంః 2006లో ఆమనగల్లు గ్రామ పంచాయితీ వార్డు సభ్యుడిగా ఎన్నిక, పదిహేనేళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నారు. పద్మశాలీ సంఘంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
గుండ్లపోచంపల్లి
మున్సిపల్ చైర్‌పర్సన్:మద్దుల లక్ష్మి
పుట్టిన తేదీ: 1974 అక్టోబర్ 15
విద్యార్హత: ఇంటర్మీడియట్
కుటుంబం: భర్త: మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మద్దుల వికాస్‌రెడ్డి, మనీష
రాజకీయ నేపథ్యం: కొత్తగా ఏర్పడిన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 15వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా 259 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భర్త మద్దుల శ్రీనివాస్‌రెడ్డి గతంలో గుండ్లపోచంపల్లి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు.
వైస్ చైర్మన్: దమ్మన్నగారి ప్రభాకర్
పుట్టిన తేదీ: 1970 అక్టోబర్ 10
విద్యార్హత : ఎస్‌ఎస్‌సీ
కుటుంబం: భార్య: వీరమణి, కుమారుడు: సందీప్ కూతుళ్లు: స్వాతి, శృతిప్రియ
రాజకీయ నేపథ్యం: మేడ్చల్ పీఎస్‌సీఎస్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా 254 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పోచారం
మున్సిపల్ చైర్మన్ :బోయపల్లి కొండల్‌రెడ్డి
పుట్టిన సంవత్సరం: 1978
విద్యార్హత: ఇంటర్ (అన్నోజిగూడ)
వృత్తి: రియల్ ఎస్టేట్
కుటుంబం: భార్య:శైలజ, కూతురు: జీవిక
రాజకీయ నేపథ్యం:2016 నుంచి 2019 వరకు టీఆర్‌ఎస్ ఘట్‌కేసర్ మండల అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు.
మున్సిపల్ వైస్ చైర్మన్:నానావత్ రెడ్యానాయక్
పుట్టిన తేది: 03–03–1979
విద్యార్హత: ఎస్‌ఎస్‌సీ (అన్నోజిగూడ)
వృత్తి: వ్యాపారం కుటుంబం: భార్య: సరిత
సంతానం: కుమారుడు: రిషి కిరణ్, కుమార్తె: భావన
రాజకీయ నేపథ్యం: 2013 నుంచి 2018 వరకు పోచారం గ్రామ వార్డు సభ్యుడిగా, 2010–2013 రైతు సహకార సంఘ డైరెక్టర్‌గా, టీఆర్‌ఎస్‌లో గ్రామశాఖ అధ్యక్షుడుగా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా కొంత కాలం పనిచేశారు.
పెద్ద అంబర్‌పేట
చైర్‌పర్సన్:చెవుల స్వప్న
వయస్సు: 28
విద్యార్హత:పదవ తరగతి
కుటుంబం: ఇద్దరుకుమారులురాజకీయ
నేపథ్యం:రాజకీయాల్లోకి కొత్తగా..
వైస్ చైర్‌పర్సన్: చామ సంపూర్ణరెడ్డి
వయస్సు: 35
విద్యార్హత: డిగ్రీ
కుటుంబం: ఇద్దరు సంతానం
రాజకీయ నేపథ్యం: గత పాలకవర్గంలో కౌన్సిలర్‌గా, ఆమె భర్త చామ విజయశేఖర్‌రెడ్డి కో ఆప్షన్, భావ చామ రాంరెడ్డి కుంట్లూర్ సర్పంచ్‌గా, మరో బావ చామ కృష్ణారెడ్డి సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేశారు. 30 ఏళ్లుగా వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది.
షాద్‌నగర్
మున్సిపాలిటీ చైర్మన్: కొందూటి నరేందర్
విద్యార్హత: బీఏ
వయస్సుః 54 సంవత్సరాలు
కుటుంబంః భార్య కొందూటి మహేశ్వరీ, కొడుకు శక్తిసాయి చరణ్, కూతురు భావన
రాజకీయ నేపథ్యంః షాద్‌నగర్ ఎంపీటీసీగా, గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. చిన్న నాటి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగి, 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు. చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైస్ చైర్మన్ః ఎంఎస్ నట్‌రాజ్
వయస్సుః 50 సంవత్సరాలు
విద్యార్హతః ఓపెన్ డిగ్రీ
కుటుంబంః భార్య లలిత, కుమారుడు అనంత కౌషిక్
రాజకీయ నేపథ్యంః 32 ఏళ్ల రాజకీయ జీవితంలో 23 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు నమ్మిన బంటుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యక్తిగత కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు.
కొంపల్లి
మున్సిపల్ చైర్మన్:సన్న శ్రీశైలం యాదవ్
పుట్టిన తేదీ: 1972 ఫిబ్రవరి 29
విద్యార్హత: ఇంటర్ డిస్‌కంటిన్యూ(మేడ్చల్)
కుటుంబం: భార్య:కవిత,
సంతానం:మల్లికార్జున్, మానస.
రాజకీయ నేపథ్యం: 1996 నుంచి 2001 వరకు ఎంపీటీసీగా, 2006 నుంచి 2011 వరకు కొంపల్లి గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడ్డ కొంపల్లి మున్సిపాలిటీలో 3వ వార్డు నుంచి ఒక్క ఓటు తేడాతో గెలుపొంది చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment