సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతారాణి పదవికి రాజీనామా చేశారు. సునీతారాణిపై 29 మంది సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరగాల్సి ఉంది. దీనికి ఒక రోజు ముందే బుధవారం సాయంత్రం ఆమె తన రాజీనామాను కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం రాకుండా చూసేందుకు, క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను వెనక్కి రప్పించేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంత్రుల స్థాయిలో ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. అవిశ్వాస తీర్మా నంపై ప్రత్యేకంగా కౌన్సిల్‌ను సమా వేశపరిచే అర్హత కలెక్టర్‌కు లేదని హైకోర్టును ఆశ్రయించారు.
28 మంది సభ్యులు కలసి ఒక కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారని కోర్టుకు నివేదిస్తూ తనపై అవిశ్వాసం పెట్టిన తీర్మానాన్ని తిరస్కరించాలని కోరారు. అయితే, కోర్టులో కూడా ఆమెకుచుక్కెదురైంది. పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో గురువారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఓటమి తప్పదని నిర్ణయించుకున్న ఆమె కలెక్టర్ కార్యాలయంలో రాజీనామా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment