బంగారు తెలంగాణే లక్ష్యం: మహమూద్ అలీ, నాయిని | my aim is golden telangana, says trs | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణే లక్ష్యం: మహమూద్ అలీ, నాయిని

Published Mon, Sep 1 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

my aim is golden telangana, says trs

సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధించడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో  చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ పునర్ని ర్మాణానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం రాజకీయపార్టీలు కలసిరావాలని కోరారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురేయాలని పిలుపునిచ్చారు.  టీఆర్‌ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 ఎస్సీ, బీసీ మంత్రులను అవమానిస్తరా..
 
 తెలంగాణ రాష్ట్రానికి మంత్రులుగా ఉన్న బీసీ, ఎస్సీ వర్గానికి చెందిన వారిని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అవమానిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆదివారం ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా ఉద్యమానికి ద్రోహం చేసిన నాగం మైండ్‌సెట్ మార్చుకోవాలని సూచించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement