
శనివారం సీఎం కేసీఆర్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న వనమా వెంకటేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం తన బాధ్యత అని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. శనివారం సాయంత్రం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కేసీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలుజరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న పోడు భూముల అంశాన్ని కూడా పరిష్కరిస్తామని సీఎం వనమాకు చెప్పారు.