
'పార్టీ మారటం లేదు, విలువలున్న మనిషిని'
హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఖండించారు. రాజకీయాల్లో విలువలున్న మనిషిని అని, తాను పార్టీ మారటం లేదని ఆయన బుధవారమిక్కడ స్పష్టం చేశారు. మే 9వ తేదీ నుంచి బచావో తెలంగాణ మిషన్ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నామన్నారు.
తెలంగాణలో ఉన్న అన్ని లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శిస్తామని నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. కాగా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు నాగం దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వెలువడటంతో నాగం పార్టీ మారుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.