నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరువలో ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 588.00అడుగులకు చేరి నిండుకుండలా కనిపిస్తోంది. మరో రెండు అడుగులు వస్తే పూర్తిస్థాయికి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరువలో ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 588.00అడుగులకు చేరి నిండుకుండలా కనిపిస్తోంది. మరో రెండు అడుగులు వస్తే పూర్తిస్థాయికి చేరుతుంది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి అనూహ్యంగా శనివా రం సాయంత్రం వరద పెరిగింది. జూరాల నుంచి 1,10,048 క్యూసెక్కులు వస్తుండగా, రోజానుంచి 26, 270 క్యూసెక్కులు వస్తోంది. దీంతో అధికారులు శ్రీశైలం రేడియల్ క్రస్ట్‌గేటు ఒకదానిని ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒకటవ విద్యుదుత్పాదక కేంద్రం ద్వా రా 31,114 క్యూసెక్కులు, రెండవ విద్యుదుత్పాదక కేం ద్రం ద్వారా 44,497 క్యూసెక్కులు, క్రస్ట్‌గేటుతో 28,029 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
సాగర్ జలాశయానికి 1,03,840 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గడిచిన 24గంటల్లో నాగార్జునసాగర్ జలాశయానికి 73,035 క్యూసెక్కులు వచ్చి చేరింది. సాగర్ కుడి, ఎడమ, ఏఎమ్మార్పీ, వరదకాలువ, కృష్ణాడెల్టాలకు 45,582 క్యూసెక్కులు వదిలారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా (312.0450 టీఎంసీలు). ప్రస్తుతం 588.00అడుగులు (306.1010టీఎంసీలు) ఉంది. మరో రెండు అడుగులు (ఆరు టీఎం సీలు) వచ్చి చేరితే సాగర్ గరిష్టస్థాయికి చేరుకుంటుంది.
కానీ స్థానికంగా వచ్చే వరదలు కావడంతో ఏ క్షణాన్నయినా వరద ఆగిపోవచ్చని, పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డి తెలిపారు. నీటిమట్టం 546 అడుగులకు దిగువన ఉన్న సమయంలోనే గేట్ల ట్రయల్న్ ్రకూడా చేసినట్లు వివరించారు. ఏక్షణంలోనైనా గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ముందస్తుగా దిగువన కృష్ణా పరీవాహక ప్రాంతంలో టాంటాం వేయించి మత్స్యకారులను, రైతులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.